Loading...
World Youth Skills Day 2026: భవిష్యత్తులో భారీ జీతం కావాలంటే ఈ 10 స్కిల్స్ ఉండాల్సిందే..
భవిష్యత్తులో భారీ జీతం కావాలంటే ఈ 10 స్కిల్స్ ఉండాల్సిందే..

World Youth Skills Day 2026: భవిష్యత్తులో భారీ జీతం కావాలంటే ఈ 10 స్కిల్స్ ఉండాల్సిందే..

వ్రాసిన వారు Moogati Shabari
Jul 15, 2026
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి ఏడాది జూలై 15న ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం (World Youth Skills Day)'ను నిర్వహిస్తారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం, స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా యువత కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి (UN) జనరల్ అసెంబ్లీ 2014లో ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉద్యోగ రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ప్రతి యువకుడికి కీలకంగా మారింది. ప్రస్తుతం అత్యంత అవసరమైన నైపుణ్యాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు

2026 థీమ్ ఇదే..

ఈ ఏడాది ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం థీమ్ "Skills for a Shared Future" (ఉమ్మడి భవిష్యత్తు కోసం నైపుణ్యాలు).

ఈ థీమ్ ద్వారా యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా.. ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడం, సాంకేతికతను సమర్థంగా వినియోగించడం, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావడం, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సందేశం ఇస్తోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా పెరుగుతోంది.

ఐటీ, బ్యాంకింగ్, ఆరోగ్య రంగం, విద్య, మీడియా, తయారీ పరిశ్రమలు సహా అనేక రంగాల్లో AI కీలక పాత్ర పోషిస్తోంది.

వివరాలు

యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు..

AI టూల్స్‌ను ఎలా ఉపయోగించాలి, ఆటోమేషన్ ఎలా పనిచేస్తుంది, బాధ్యతాయుతంగా AIని ఎలా వినియోగించాలి అనే అంశాలపై అవగాహన ఉంటే యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం మాత్రమే కాకుండా డిజిటల్ లిటరసీ కూడా ఎంతో కీలకం.

ఆన్‌లైన్ సేవలను వినియోగించడం, డిజిటల్ చెల్లింపులు చేయడం, క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం, సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండటం, ఇంటర్నెట్‌ను బాధ్యతాయుతంగా వినియోగించడం వంటి నైపుణ్యాలు నేటి యువతకు తప్పనిసరిగా మారాయి.

ఈ స్కిల్స్ ఉంటే డిజిటల్ ఎకానమీలో లభించే అవకాశాలను సులభంగా అందిపుచ్చుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే కెరీర్‌ కష్టమే..

ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా.. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే కెరీర్‌లో ముందుకు సాగడం కష్టమే.

స్పష్టంగా మాట్లాడటం, సమర్థవంతంగా రాయడం, టీమ్‌తో కలిసి పనిచేయడం, ప్రజెంటేషన్లు ఇవ్వడం, ఇతరులతో సమన్వయం చేసుకోవడం వంటి నైపుణ్యాలు దాదాపు ప్రతి ఉద్యోగంలో అవసరం. ఇవి వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగత అభివృద్ధికీ ఎంతో ఉపయోగపడతాయి.

నేటి ప్రపంచంలో డేటా విలువ రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాపారం, ఆరోగ్య రంగం, ఫైనాన్స్, మార్కెటింగ్, టెక్నాలజీ వంటి అనేక రంగాల్లో డేటా ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

డేటాను విశ్లేషించడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక డేటా టూల్స్‌ను వినియోగించడం వంటి నైపుణ్యాలు ఉంటే యువతకు మెరుగైన కెరీర్ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

అత్యంత డిమాండ్ ఉన్న స్కిల్..

అలాగే కోడింగ్ కూడా ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న నైపుణ్యాల్లో ఒకటి.

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్‌సైట్ డిజైన్, మొబైల్ యాప్‌ల అభివృద్ధి, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో కోడింగ్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి.

ప్రతి ఒక్కరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాల్సిన అవసరం లేకపోయినా.. ప్రాథమిక ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం ఉంటే డిజిటల్ ప్రపంచాన్ని సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు భవిష్యత్ అవకాశాలను మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చు.

ADVERTISEMENT