Page Loader
భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: యేల్‌ వర్సిటీ-సీ ఓటర్‌ సర్వేలో భారతీయుల వెల్లడి 
భూమి మీద పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: యేల్‌ వర్సిటీ-సీ ఓటర్‌ సర్వేలో భారతీయుల వెల్లడి 

వ్రాసిన వారు Sriram Pranateja
May 16, 2023
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన యేల్ యూనివర్సిటీ, వాతవరణంలోని మార్పుల గురించి భారతీయుల అభిప్రాయాలు సేకరించింది. పెరుగుతున్న భూమి ఉష్ణోగ్రతలు- భారత ప్రజల అవగాహన అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, భారతీయులు తమ అభిప్రాయాలను ఈ విధంగా చెప్పుకొచ్చారు. వాతావరణంలో మార్పులు స్పష్టంగా ఏర్పడుతున్నాయని, భూమి మీద ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిందని, పెరిగిన వేడి కారణంగా జీవన విధానాలు ప్రభావితం అవుతున్నాయని అన్నారు. పర్యావరణంలో మార్పులు, మనుషులు చేసే పనుల వల్ల భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దాదాపు 82శాతం మంది ప్రజలు భూమి మీద ఉష్ణోగ్రత పెరిగిందని పేర్కొన్నారు. దాదపు 4169మంది భారతీయులపై టెలిఫోన్ ఆధారంగా ఈ సర్వే చేపట్టారు.

Details

అధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు ఎక్కువవుతున్నాయి 

సాధారణంగా భూమి మీద అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆ రోజుల సంఖ్య పెరిగిందని, దీన్ని బట్టి భూమి మీద వేడి పెరిగిందని అర్థమవుతోందని అన్నారు. భూమి మీద వేడి ఇలానే పెరిగితే వచ్చే 20సంవత్సరాల్లో భూమి మీద జీవించడం కష్టంగా మారుతుందని, అనేక వ్యాధులు సోకే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు. భూమి మీద వర్షాపాతం కూడా తగ్గిందని 44శాతం మంది అన్నారు. అలాగే వర్షాపాతం పెరిగిందని 34శాతం మంది అభిప్రాయ పడ్డారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం పెరిగిందని, విపత్తుల నుండి బయటపడటానికి సమయం కూడా ఎక్కువగా అవుతోందని, ఈ కార్యక్రమం నిర్వహించిన సర్వేలో వెల్లడి చేసారు.