మీరు తీవ్రంగా అలసిపోయారా? మనసును, శరీరాన్ని ప్రశాంతంగా మార్చే ఈ యోగాసనాలు ప్రయత్నించండి
ఈ వార్తాకథనం ఏంటి
యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒక విషయంపై ఫోకస్ ను పెంచడం నుండి శారీరక అలసట నుండి ఉపశమనం వరకు యోగా వల్ల ఎన్నో లాభాలున్నాయి.
ప్రస్తుతం శారీరక అలసట నుండి ఉపశమనాన్ని అందించే యోగాసనాలు తెలుసుకుందాం. ఈ ఆసనాలు చేయడం కూడా చాలా సులభం.
బాలాసనం:
ఈ ఆసనం చేయడం యాంగ్జాయిటీ నుండి రిలీఫ్ దొరుకుతుంది. ముందుగా మోకాళ్ల మీద కూర్చుని, మడమలకు పిరుదులను ఆనించి, నెమ్మదిగా ముందుకు వంగాలి.
ఈ ప్రాసెస్ లో తొడభాగానికి రొమ్ము భాగం తాకాలి. ఆ తర్వాత చేతులను తలకు సమాంతరంగా ముందుకు చాపినా ఫర్వాలేదు, లేదంటే వెనక్కు చాపినా బానే ఉంటుంది.
Details
మెదడుకు రక్తాన్ని చేరవేసే ఆసనం
సేతు బంధాసనం:
వెల్లకిలా పడుకుని, మోకాళ్ళను వంచి, పాదాలను శరీరం వైపు లాక్కోవాలి. ఇప్పుడు తొడల భాగాన్ని, నడుము భాగాన్ని పైకి లేపాలి. ఈ ప్రాసెస్ లో తలను పైకి లేపకూడదు. దీనివల్ల మెదడులో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది.
భ్రమరి ప్రాణాయామం:
పద్మాసనంలో కూర్చుని, బొటన వేళ్లతో చెవులను మూసేసి, మిగతా వేళ్ళతో కళ్ళను మూసి, గాలి పీల్చుకుని, ఓం అనే శబ్దం చేస్తూ గాలిని వదిలేయండి.
అనులోమ విలోమ:
సుఖాసనంలో కూర్చుని కుడిచేతి బొటన వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రంలో నుండి గాలి పీల్చుకోవాలి. ఆ తర్వాత కుడి ముక్కులోంచి గాలిని వదిలేయాలి. ఇదే ప్రాసెస్ ని రివర్స్ లో చేయాలి.