Page Loader
తాడును ఉపయోగించి సులభంగా వేయగలిగే యోగాసనాలు 
తాడు సాయంతో ఈజీగా చేయగలిగే ఆసనాలు

తాడును ఉపయోగించి సులభంగా వేయగలిగే యోగాసనాలు 

వ్రాసిన వారు Sriram Pranateja
May 03, 2023
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

యోగా చేయడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే యోగాలోని కొన్ని ఆసనాలను అంత సులభంగా వేయలేరు. కొత్తగా నేర్చుకునే వారు కఠినమైన యోగాసనాలు వేయలేరు. ఈ నేపథ్యంలో తాడు సాయంతో యోగాసనాలు వేయడం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తాడు సాయంతో యోగాసనాలను సులభంగా వేయవచ్చు. ప్రస్తుతం తాడు సాయంతో సులభంగా వేయగలిగే ఆసనాలేంటో తెలుసుకుని యోగా ప్రయోజనాలు పొందండి. జాను శీర్షాసనం: నేలమీద కూర్చుని కుడి కాలుని నిటారుగా చాపాలి. ఎడమ కాలును చాపకుండా ఉంచుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా నడుము భాగాన్ని ముందుకు వంచుతూ, మీ తలను కాలిబొటన వేలుకు తగిలించాలి. ఇప్పుడు మళ్ళీ ఎడమ కాలుతో చేయండి. తాడు సాయంతో చేస్తే ఈజీగా చేయగలరు.

Details

తాడు సాయంతో ఈజీగా చేయగలిగే ఆసనాలు 

సుప్త పాదంగుస్తాసనం: కాళ్ళను నిటారుగా ఉంచి వెల్లకిలా పడుకోవాలి. ఇప్పుడు తాడు సాయంతో కుడి కాలుని పైకి లేపాలి. ఎడమ కాలును నేలమీదే నిటారుగా ఉంచాలి. మీరెంత వరకు కాలును లేపగలరో అంతవరకూ లేపాలి. ఆ తర్వాత ఎడమ కాలుతో రిపీట్ చేయాలి. ఉత్తిష్ఠ హస్త పాదంగుస్తాసనం: నిటారుగా నిలబడండి. ఇప్పుడు మీ తాడు సాయంతో కుడికాలును కుడివైపు పైకి లేపండి. మీ ఎడమ చేతిని గాల్లో లేపి శరీరాన్ని బ్యాలన్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మళ్ళీ ఎడమ కాలుతో రిపీట్ చేయండి. పశ్చిమోత్థాసనం: కాళ్ళను ముందుకు చాపి నడుము భాగాన్ని ముందుకు వంచి, మోకాళ్ళకు తలను ఆనించాలి. చేతులను తలకు సమాంతరంగా ఉంచుకోవాలి.