
Yoga Day 2025: యోగా దినోత్సవం 2025.. పనిచేసే ఉద్యోగుల కోసం 5 డెస్క్ యోగాసానాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
యోగా దినోత్సవం 2025 సందర్భాన్ని పురస్కరించుకుని, జూన్ 21న మనం రోజువారీ జీవితంలో ముఖ్యంగా ఆఫీసులో కూడా యోగాను ఎలా చేర్చుకోవచ్చో చూద్దాం. యోగా అంటే మ్యాట్లు, తోటల్లోనే చేయాలనేది చాలామంది అభిప్రాయం. దీంతో బిజీ షెడ్యూళ్లున్నవారికి యోగా చేయడానికి సమయం సరిపోక ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. కానీ యోగా అనేది చాలా సరళమైనది, సులభంగా అనుసరించదగినది. డెస్క్ యోగా స్ట్రెచ్‌లతో దీన్ని మన రోజువారీ ఆఫీస్ పనిలోనూ భాగం చేయవచ్చు. ఇలా చేస్తే, ఎక్కువ గంటలు పనిచేసినా ఉద్యోగులు ఉత్సాహంగా, ఒత్తిడిలేకుండా ఉండగలరు. పలువురు యోగా నిపుణులు ఉద్యోగుల కోసం 4 డెస్క్ యోగా స్ట్రెచ్‌లను పరిచయం చేశారు. వాటిని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరించారు:
Details
గ్రీవ సంచాలన క్రియ (మెడ తిప్పడం)
ఎలా చేయాలి: డెస్క్ వద్ద నిటారుగా కూర్చుని, మెడను నెమ్మదిగా సవ్యదిశలో(క్లాక్‌వైజ్)తిప్పాలి. పైకెళ్లే సమయంలో శ్వాస పీల్చుకోవాలి, కిందికి వచ్చే సమయంలో శ్వాస విడిచేయాలి. ఇలా 5-8 సార్లు చేయాలి. తరువాత అపసవ్య దిశలో(యాంటీ-క్లాక్‌వైజ్)కూడా పునరావృతం చేయాలి. ప్రయోజనాలు: మెడ, భుజాలపై ఉన్న ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. తాడాసనం ఎలా చేయాలి: డెస్క్ వద్ద పని చేస్తున్నప్పుడు ప్రతి రెండు గంటలకు ఒకసారి లేచి నిలబడాలి. రెండు చేతులను వేళ్లు కలిపి తలపైకెత్తాలి. శరీర బరువును కాలివేళ్లపై ఉంచి, శరీరాన్ని పూర్తిగా సాగదీయాలి. ఇలా 5 సార్లు చేయాలి. ప్రయోజనాలు: రక్త ప్రసరణను శరీరమంతా మెరుగుపరుస్తుంది. కండరాల వ్యవస్థకు తక్షణ శక్తిని అందించి, శరీరాన్ని సరైన స్థితికి తెస్తుంది.
Details
పరివృత్త సుఖాసనం
ఎలా చేయాలి: కుర్చీలో నిటారుగా కూర్చుని, ఎడమ చేతిని కుడి మోకాలిపై ఉంచాలి. శరీరాన్ని కుడివైపుకు తిప్పుతూ, కుడిచేతిని కుర్చీ వెనుక భాగంపై ఉంచాలి. ఛాతీని ముందుకు ఉంచుతూ, వెన్నెముకను నిటారుగా సాగదీయాలి. ప్రయోజనాలు: శ్వాసను లోతుగా తీసుకుంటూ 5-8 సెకన్లు అలాగే ఉంచాలి. ఇరువైపులా 3-5 సార్లు పునరావృతం చేయాలి. ఇది వెన్నెముకపై ఉన్న ఒత్తిడిని తక్షణమే తొలగిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల వైపు శక్తిని పెంచుతూ, శరీరంపై భాగాన్ని సరైన స్థితికి తెచ్చి విశ్రాంతినిస్తుంది.
Details
నాసికాగ్రహ దృష్టి (ముక్కు చివర దృష్టి)
ఎలా చేయాలి: సౌకర్యవంతమైన భంగిమలో కూర్చుని, కనురెప్పలు వాల్చకుండా ముక్కు చివరను ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూసే ప్రయత్నం చేయాలి. ప్రయోజనాలు: వ్యాయామం పూర్తయిన తరువాత కళ్ళను మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి లేదా అరచేతులను వేడిచేసుకుని కళ్ళపై ఉంచాలి (వార్మ్ పాల్మింగ్). ఈ పద్ధతి మానసిక స్పష్టత, స్థిరత్వం, ఏకాగ్రతను పెంచుతుంది. కండరాలను బలోపేతం చేసి, కళ్ళ ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.