
YouTube Ads : యూట్యూబ్ ప్రీమియం లేకుండానే.. యాడ్స్‌ని సింపుల్‌గా స్కిప్ చేయండి ఇలా..
ఈ వార్తాకథనం ఏంటి
మీరు యూట్యూబ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? లైఫ్‌స్టైల్ నుంచి న్యూస్ అప్‌డేట్స్, ఫైనాన్స్ వరకు.. ఏ విషయమైనా తెలిసుకోవాలంటే వెంటనే యూట్యూబ్‌నే ఓపెన్ చేస్తారా?
అయితే యాడ్స్ వల్ల విసుగు ఎక్కువగా వస్తుందా? వీడియో మధ్యలో అకస్మాత్తుగా వచ్చే ప్రకటనలు చూసి మీ వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ దెబ్బతింటోందా?
అయితే ఈ చిట్కాలు మీ కోసమే. సాధారణంగా యాడ్‌లను తొలగించాలంటే యూట్యూబ్ ప్రీమియంకి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.
కానీ అందరికీ తెలియని కొన్ని చిట్కాలు, స్మార్ట్ మార్గాలు ఉన్నాయి. ఇవి ఉపయోగించి డబ్బు పెట్టకుండా కూడా యాడ్‌లను దూరం చేయవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం:
వివరాలు
1. వీడియోలను డౌన్‌లోడ్ చేసి ఆఫ్‌లైన్‌లో చూడండి
యాడ్స్ లేకుండా వీడియోలు చూడటానికి ఇది చాలా సాధారణమైన,సులభమైన మార్గం.
మీరు ఇష్టపడే వీడియోలను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో వీక్షించండి.
అయితే ఈఫీచర్ కొన్ని దేశాల్లో మాత్రమే ఉచిత వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
ఇది మీప్రాంతంలో అందుబాటులో లేకపోతే,YT-DLP వంటి ఓపెన్ సోర్స్ టూల్స్‌ను ఉపయోగించి వీడియోలను యాడ్స్ లేకుండా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2. యాడ్ బ్లాకర్లను ఉపయోగించండి
ఇంటర్నెట్ బ్రౌజర్‌ల కోసం అందుబాటులో ఉన్న యాడ్ బ్లాకర్ ఎక్స్‌టెన్షన్‌లు,ఉదాహరణకు uBlock Origin,Adblock for YouTube వంటివి వీడియోల్లో వచ్చే యాడ్‌లను ఆటోమేటిక్‌గా ఆపేస్తాయి.
క్రోమ్,ఫైర్‌ఫాక్స్,ఎడ్జ్ వంటి బ్రౌజర్లకు వీటి ఎక్స్‌టెన్షన్‌లు లభ్యమవుతాయి.ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఈ బ్లాకర్లు యూట్యూబ్ పేజీని స్కాన్ చేసి ప్రకటనలను లోడ్ కాకుండా అడ్డుకుంటాయి.
వివరాలు
3. "డాట్ ట్రిక్"ను ప్రయత్నించండి
ఇది చాలా చిన్నపని కానీ బాగా పనిచేసే ట్రిక్. యూట్యూబ్ వీడియో URLలో ".com" తర్వాత ఒక పిరియడ్ (.) పెట్టండి.
ఉదాహరణకు: అసలు లింక్: https://www.youtube.com/watch?v=xyz123
మార్చిన లింక్: https://www.youtube.com./watch?v=xyz123
ఈ చిన్న మార్పు వల్ల యాడ్ సిస్టమ్ బద్దలవుతుంది, తద్వారా ప్రకటనలు ప్లే కావు.
4. మొబైల్‌లో యాడ్ స్కిప్పింగ్‌ను ఆటోమేట్ చేయండి
మొబైల్ పరికరాల్లో యాడ్స్ వచ్చే ప్రతి సారి స్కిప్ చేయడానికి వేచి ఉండడం నిరుత్సాహపరిచే విషయం.
స్క్రీన్‌ను ఎడమ లేదా కుడి వైపు స్వైప్ చేయడం ద్వారా కొన్ని చిన్న ప్రకటనలను దాటవేయొచ్చు.
ఇంకా మెరుగైన అనుభవం కోసం,మీ మొబైల్ బ్రౌజర్‌లో యాడ్ బ్లాకర్‌ను కలిపి ఉపయోగించండి. ఇలా చేస్తే,ఆటోమేటెడ్‌గా యాడ్స్ స్కిప్ అవుతాయి.
వివరాలు
5. యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయాలు ఎంచుకోండి
యూట్యూబ్‌లో ప్రకటనలతో విసుగుపడుతున్నారా? అయితే NewPipe, PeerTube, Vimeo వంటి యాప్‌లను పరిగణించండి.
ఇవి యాడ్‌లను చూపకుండా యూట్యూబ్ కంటెంట్‌ను స్ట్రీమ్ చేయగలవు.
NewPipe - యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో ట్రెండింగ్ వీడియోలు, సబ్‌స్క్రిప్షన్‌లు, ప్లేలిస్ట్‌లను యాడ్స్ లేకుండా చూపిస్తుంది.
గమనిక: NewPipe గూగుల్ ప్లేస్టోర్‌లో దొరకదు. దీన్ని GitHub, F-Droid వంటి రిపోజిటరీల నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.