Page Loader
Asteroid: మహాముప్పు భూమి వైపు ముంచుకొస్తోంది... నాసా నుండి ప్రపంచానికి హెచ్చరిక! 
మహాముప్పు భూమి వైపు ముంచుకొస్తోంది... నాసా నుండి ప్రపంచానికి హెచ్చరిక!

Asteroid: మహాముప్పు భూమి వైపు ముంచుకొస్తోంది... నాసా నుండి ప్రపంచానికి హెచ్చరిక! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2025
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

యుగాంతం తప్పదని చాలాసార్లు వినే ఉంటాం. అయితే ఇప్పటివరకు, ఇలాంటి వార్తలు నిజం కాలేదు. భూమి వైపునకు దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్స్‌ మాత్రం ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు 2024 YR4 అనే కోడ్ నేమ్ కలిగిన ఉల్కను కనుగొన్నారు. NASA ప్రకారం, ఈ ఉల్క 2032 డిసెంబర్ 22న భూమిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ భారీ గ్రహశకలం, సుమారు ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్దగా ఉండే అవకాశముంది.

Details

99శాతం అవకాశం లేనట్లే

సుమారు 130 నుండి 300 అడుగుల పొడవుతో ఉండనుంది. అంటే 40 మీటర్ల నుండి 90 మీటర్ల వరకు. గ్రహశకలం భూమి వైపు చాలా వేగంగా వస్తోంది. దీనివల్ల 2032లో భూమిని ఢీకొట్టే అవకాశాలు అధికంగా ఉంటాయని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అబు దాబీలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ ప్రకారం, 2024 YR4 గ్రహశకలం 2032లో భూమికి అత్యంత దగ్గరగా వెళ్తుంది. NASA శాస్త్రవేత్తలు, ఈ గ్రహశకలం 2032 డిసెంబర్ 22న భూమిపై ప్రభావం చూపే అవకాశం 1శాతం కంటే ఎక్కువ ఉందని చెప్పారు. అంటే దీని ప్రభావం చూపే అవకాశం 99శాతం లేనిట్లే అని చెప్పొచ్చు.

Details

గ్రహాన్ని గుర్తించిన ఆస్ట్రారాయిడ్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టం

2024 డిసెంబర్ 27న NASA కి చెందిన ఆస్ట్రారాయిడ్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టం ఈ గ్రహశకలాన్ని కనుగొంది. IAC రిపోర్ట్ ప్రకారం, ఈ గ్రహశకలం 2024 డిసెంబర్ 25న భూమికి దగ్గరగా వచ్చింది. తరువాత 2028 డిసెంబర్ 17న మరోసారి భూమికి దగ్గరగా వస్తుందని అంచనా వేశారు. కానీ ఆ సందర్భంలో ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉండవచ్చని చెప్పారు. అయితే 2032 డిసెంబర్ 22న గ్రహశకలం మరింత దగ్గరగా వచ్చి, భూమిని ఢీకొట్టే ఛాన్స్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.