Page Loader
WhatsApp: వాట్సప్‌‌లో కొత్త ఫీచర్.. వీడియో కాల్స్ మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం 
వాట్సప్‌‌లో కొత్త ఫీచర్.. వీడియో కాల్స్ మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం

WhatsApp: వాట్సప్‌‌లో కొత్త ఫీచర్.. వీడియో కాల్స్ మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2024
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రాముఖ్యత గల మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌ను ఒక సమగ్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కొత్త ప్రయత్నాలను చేస్తోంది. ఆ దిశగా ఇప్పుడు ముందుకెళ్తోంది. యూజర్ల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని పలు కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తోంది. వాటిలో వీడియో కాల్‌లు చేసేటప్పుడు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ప్రత్యేక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వాట్సాప్ కొత్త ఫీచర్ ద్వారా వీడియో కాల్‌ సమయంలోనే మీ ఇష్టానికి సరిపడే స్క్రీన్‌ను మార్చుకోవచ్చు. అంటే, మీరు మాట్లాడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌ను సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు కేఫ్‌లో కూర్చుని మాట్లాడుతున్నట్టు లేదా బీచ్‌లో ఉన్నట్లు బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చుకొనే అవకాశాన్ని కల్పించింది.

details

10 రకాల బ్యాక్ గ్రౌండ్లు

ఈ ఫీచర్‌లో బ్లర్ ఎఫెక్ట్ వంటి ఆప్షన్లు కూడా ఉంటాయి, ఇంకా 10 రకాల బ్యాక్‌గ్రౌండ్లు ఉన్నాయి. మీ గోప్యతను కాపాడేందుకు స్టైలిష్ బ్యాక్‌గ్రౌండ్‌లు ఎంపిక చేసుకోవచ్చు. వార్మ్, కూల్, బ్లాక్ అండ్ వైట్, డ్రీమీ వంటి 10 రకాల ఫిల్టర్లను కూడా అందించనున్నారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా వీడియో కాల్‌లో సంభాషణలు మరింత ఆకర్షణీయంగా మారనున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న వారాల్లో ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులోకి రానుందని తెలిపారు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన వాట్సాప్ ఛానల్ ద్వారా ఈ ఫీచర్ గురించి సమాచారం అందించారు.