Loading...
Interstellar comet : ఆకాశంలో అరుదైన అద్భుతం.. 1.7 లక్షల ఏళ్ల తర్వాత కనిపించనున్న అరుదైన ధూమకేతువు
ఆకాశంలో అరుదైన అద్భుతం.. 1.7 లక్షల ఏళ్ల తర్వాత కనిపించనున్న అరుదైన ధూమకేతువు

Interstellar comet : ఆకాశంలో అరుదైన అద్భుతం.. 1.7 లక్షల ఏళ్ల తర్వాత కనిపించనున్న అరుదైన ధూమకేతువు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2026
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష ప్రేమికులకు అరుదైన అవకాశాన్ని అందించే ఖగోళ ఘటన త్వరలో కనిపించనుంది. అంతరిక్షం వెలుపలి నుంచి వచ్చిన ఒక అరుదైన ధూమకేతువు ప్రస్తుతం సౌర కుటుంబం గుండా ప్రయాణిస్తోంది. ఈ ధూమకేతువు C/2025 R3 (Pan-STARRS)గా గుర్తించారు. 2025 సెప్టెంబర్ 7న హవాయిలోని హలేకలాలో పాన్-స్టార్స్ ద్వారా ఇది మొదట కనుగొన్నారు.

వివరాలు

లక్షల సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే

ఈ ధూమకేతువు సూర్యుని చుట్టూ ఒక పూర్తి పరిభ్రమణం చేయడానికి సుమారు 1.7 లక్షల సంవత్సరాలు పడుతుంది.

అందువల్ల ప్రస్తుతం కనిపించడం అత్యంత అరుదైన సంఘటనగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఎప్పుడు, ఎలా చూడాలి?

ఈ ధూమకేతువు వచ్చే 10 రోజుల్లో క్రమంగా మరింత ప్రకాశవంతంగా మారనుంది. ఏప్రిల్ 19న ఇది సూర్యునికి అత్యంత సమీపమైన స్థితి (పెరిహీలియన్) చేరుకుంటుంది.

అయితే భూమి-సూర్యుడి మధ్య దూరం సగం వరకు మాత్రమే చేరుకోనున్నందున ఇది విరిగిపోయే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏప్రిల్ 27న ఈ ధూమకేతువు భూమికి అత్యంత సమీపంగా ఉండి అత్యధిక కాంతితో కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో ఉత్తరార్థ గోళంలో ఇది స్పష్టంగా కనిపించే అవకాశం తక్కువగా ఉంది.

వివరాలు

వీక్షణకు ఉత్తమ సమయం

ఏప్రిల్ 10 నుంచి 20 మధ్య ఈ ధూమకేతువును వీక్షించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో చీకటి ఆకాశంలో ఇది స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది.

బ్రిటిష్ ఆస్ట్రోనామికల్ అసోసియేషన్ కామెట్ విభాగం అధిపతి నిక్ జేమ్స్ ప్రకారం, తెల్లవారుజామున సూర్యోదయానికి గంటన్నర ముందు తూర్పు దిశలో స్పష్టమైన హోరైజన్ వద్ద చూడటం ఉత్తమం.

ఎక్కడ కనిపిస్తుంది?

ప్రస్తుతం ఈ ధూమకేతువు పెగాసస్ నక్షత్రరాశిలో ప్రయాణిస్తోంది. ముఖ్యంగా 'గ్రేట్ స్క్వేర్ ఆఫ్ పెగసస్' ప్రాంతానికి సమీపంలో ఇది కనిపిస్తుంది.

ఈ ప్రాంతంలో Scheat, Alpheratz, Markab, Algenib వంటి నక్షత్రాలు ఉంటాయి.

ADVERTISEMENT

వివరాలు

ఎలా గుర్తించాలి?

ఈ ధూమకేతువును గుర్తించాలంటే మసకబారిన వెలుగుతో కనిపించే 'కోమా'ను గమనించాలి. సూర్యుడికి దగ్గరపడే కొద్దీ దీని తోక కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

సాధారణంగా కంటితో కూడా కనిపించినా, 10x50 బైనాక్యులర్స్ ఉపయోగిస్తే మరింత స్పష్టంగా వీక్షించవచ్చు.

మొత్తంగా లక్షల సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే కనిపించే ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని చూసే అవకాశం ఖగోళ ప్రేమికులకు అందుబాటులోకి రావడం విశేషమని చెప్పొచ్చు

ADVERTISEMENT