Loading...
SpaceX Rocket: గంటకు 5,400 మైళ్ల వేగంతో చంద్రుడిని తాకిన ఫాల్కన్ 9 శకలం
గంటకు 5,400 మైళ్ల వేగంతో చంద్రుడిని తాకిన ఫాల్కన్ 9 శకలం

SpaceX Rocket: గంటకు 5,400 మైళ్ల వేగంతో చంద్రుడిని తాకిన ఫాల్కన్ 9 శకలం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్పేస్‌-Xకు చెందిన ఫాల్కన్ 9 (SpaceX Falcon 9) రాకెట్‌లోని ఒక రీయూజబుల్ భాగం బుధవారం చంద్రుడిపై కుప్పకూలినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడకపోయినా, రాకెట్ శకలం ఇప్పటికే చంద్రుడిని ఢీకొని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫాల్కన్ 9 రాకెట్‌ను జనవరి 2025లో ప్రయోగించారు.దాని రీయూజబుల్ భాగం గత ఏడాది నుంచి భూమి, చంద్రుడి మధ్య అంతరిక్షంలో ప్రయాణిస్తూ ఉండగా,చివరకు చంద్రుడిపై పడినట్లు విశ్లేషిస్తున్నారు. ఐదు అంతస్తుల భవనం ఎత్తుతో సమానమైన పరిమాణంలో ఉన్న ఈ శకలం, భూమిపై ఉంటే సుమారు 4 వేల కిలోల బరువు ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

వివరాలు 

ఐన్‌స్టీన్ క్రేటర్ సమీపంలో కుప్పకూలి ఉండొచ్చని అంచనా

ఈ శకలం చంద్రుడిపై ఉన్న ఐన్‌స్టీన్ క్రేటర్ సమీపంలో కుప్పకూలి ఉండొచ్చని అంచనా.

ఢీకొన్న ప్రభావంతో చంద్రుడి ఉపరితలంపై గణనీయమైన గుంత ఏర్పడే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రభావం తర్వాత ఎగిసిపడే చంద్ర ధూళి, కొత్తగా ఏర్పడే గుంతకు సంబంధించిన చిత్రాలను అమెరికా టెలిస్కోపులు, నాసాకు చెందిన లూనార్ రీకానైసెన్స్ ఆర్బిటర్ (LRO),దక్షిణ కొరియా దనూరి (Danuri) ప్రోబ్ రాబోయే రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.

వివరాలు 

భూమికి ఎలాంటి ముప్పు లేదు 

ఈ రాకెట్ శకలం గంటకు సుమారు 5,400 మైళ్ల వేగంతో చంద్రుడిని ఢీకొన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఈ ఢీకొట్టడంతో చంద్రుడిపై సుమారు 18 మీటర్ల లోతు, 12 మీటర్ల వెడల్పు కలిగిన గుంత ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

అయితే, ఈ ఘటన వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇది పూర్తిగా చంద్రుడి ఉపరితలానికే పరిమితమైన ప్రభావమని, భూమిపై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం ఉండదని తెలిపారు.

ADVERTISEMENT