Page Loader
స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్‌ వస్తోంది: మస్క్ ట్వీట్
స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్‌ వస్తోంది: మస్క్ ట్వీట్

స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్‌ వస్తోంది: మస్క్ ట్వీట్

వ్రాసిన వారు Stalin
Jun 18, 2023
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీ ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ మరో కీలక ప్రకటన చేసారు. స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్‌ను తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. ఓ ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్‌కు రిప్లైగా మస్క్ ఈ మేరకు ప్రకటన చేశారు. ట్విట్టర్‌లో వీడియో కంటెంట్‌ను పెంచడంపై తీసుకుంటున్నచర్యల్లో భాగంగా ఎలోన్ మస్క్ ఈ మేరకు ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్ అవసరమని, తాను ట్విట్టర్‌లో గంట నిడివి గల వీడియోను చూడలేకపోతున్నానని ఓ వినియోగదారు ట్వీట్ చేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన మస్క్ ట్విట్టర్ వీడియో యాప్ వస్తోందని జవాబిచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మస్క్ చేసిన ట్వీట్