భారతదేశంలో AMD సపోర్టెడ్ Aspire 3 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన Acer
Acer భారతదేశంలో అనేక అప్‌గ్రేడ్‌లతో Aspire 3 ల్యాప్‌టాప్ రిఫ్రెష్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ Acer Aspire 3 భారతదేశంలో Ryzen 5 7000 సిరీస్ ప్రాసెసర్‌తో వచ్చిన మొదటి ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ మల్టీ టాస్కింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎక్కువసేపు పనిచేయాల్సి వచ్చినప్పుడు ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడానికి థర్మల్ రెగ్యులేషన్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది సిల్వర్ రంగు ఫినిషింగ్ తో వస్తుంది. ఇందులో మల్టీ-జెస్చర్ టచ్‌ప్యాడ్, బ్యాక్‌లిట్ కీబోర్డ్, HD వెబ్ కెమెరా. ల్యాప్‌టాప్ కు 15.6-అంగుళాల పూర్తి HD LED-బ్యాక్‌లిట్ TFT LCD స్క్రీన్ ఉంది.
Acer ప్రత్యేకమైన ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు విజయ్ సేల్స్ వంటి భాగస్వామి రిటైలర్‌ల దగ్గర లభిస్తుంది
I/O కోసం, Acer Aspire 3లో రెండు టైప్-A (USB 3.2) పోర్ట్‌లు, టైప్-C పోర్ట్, HDMI స్లాట్ ఉన్నాయి. వైర్‌లెస్ కనెక్టివిటీలో భాగంగా Wi-Fi 5, బ్లూటూత్ 5.1కి సపోర్ట్ ఇస్తుంది. ఇందులో 8GB LPDDR5 RAM, 512GB PCIe Gen4 SSD స్టోరేజ్ ఉంది. దీనికి 40Wh బ్యాటరీతో పాటు, 45W పవర్ అడాప్టర్ తో పాటు లోపల డ్యూయల్ స్పీకర్లు, మైక్రోఫోన్ తో వస్తుంది. Acer Aspire 3 ఇప్పుడు భారతదేశంలో అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని ధర రూ. 47,990 ఇది బ్రాండ్ వెబ్‌సైట్ లో, అమెజాన్ లో, Acer ప్రత్యేకమైన ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు విజయ్ సేల్స్ వంటి భాగస్వామి రిటైలర్‌ల దగ్గర అందుబాటులో ఉంది.