Acer, Razer, MSI, ASUS నుండి రాబోతున్న సరికొత్త ల్యాప్‌టాప్‌లు
CES 2023లో, సరికొత్త టెక్నాలజీ వినియోగదారుల ముందుకు వచ్చింది. వివిధ ప్రసిద్ధ బ్రాండ్‌ల నుండి ల్యాప్‌టాప్స్ అమ్మకానికి సిద్ధమవుతున్నాయి. కొత్త తరం ఫీచర్‌లు, తాజా హార్డ్‌వేర్, అత్యుత్తమ-నాణ్యత డిస్‌ప్లే ల్యాప్‌టాప్‌ల కోసం వెతుకుతున్న కొనుగోలుదారులని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ప్రపంచ ప్రసిద్ధ టెక్ ఈవెంట్‌లో Acer, Razer, MSI, ASUS నుండి లాంచ్ అయిన కొత్త ల్యాప్‌టాప్స్ గురించి తెలుసుకుందాం. ASUS Chromebook Vibe CX34 ఫ్లిప్‌ను ప్రకటించింది, ఇది క్లౌడ్-ఆధారిత గేమింగ్ కోసం ప్రత్యేక ల్యాప్‌టాప్. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 14-అంగుళాల పూర్తి-HD+ స్క్రీన్ తో వస్తుంది.16GB LPDDR4X RAM 512GB వరకు SSD స్టోరేజ్ తో వస్తుంది. 63Wh బ్యాటరీ 10 గంటల వరకు పనిచేస్తుంది.
గేమ్ ఆధారిత ల్యాప్‌టాప్స్ ప్రత్యేక ఆకర్షణ
CES 2023లో,Razer బ్లేడ్ 16, బ్లేడ్ 18 ల్యాప్‌టాప్‌లను పరిచయం చేసింది. 16-అంగుళాల మోడల్ 120Hz, 18-అంగుళాల మోడల్ 240Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తున్నాయి. Acer నుండి వస్తున్న సరికొత్త ప్రిడేటర్ హీలియోస్ గేమ్ ఆధారిత ల్యాప్‌టాప్ 16-అంగుళాల, 18-అంగుళాల LED డిస్‌ప్లే మోడల్‌లలో 165Hz/240Hz రిఫ్రెష్ రేట్లతో వస్తుంది. 32GB వరకు DDR4 RAM, 2TB వరకు PCIe Gen4 SSD స్టోరేజ్ తో వస్తుంది. MSI రైడర్ GE78 HX ల్యాప్‌టాప్‌ను17.3-అంగుళాలLCD స్క్రీన్‌తో 240Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 64GB వరకు DDR5 RAM, 2TB SSD వరకు స్టోరేజ్ అందిస్తుంది. ఇంకా ఈ లిస్ట్ లో Acer స్విఫ్ట్ గో, ASUS జెన్‌బుక్ 14X/16X OLED కూడా ఉన్నాయి.