సూర్యుడికి మరింత దగ్గరలో ఆదిత్య- ఎల్ 1 మిషన్: వెల్లడి చేసిన ఇస్రో
సూర్యుడి గురించి అధ్యయనం చేయడానికి ఆదిత్య-ఎల్1 మిషన్ ని ఇస్రో ప్రయోగించింది. ప్రస్తుతం ఈ మిషన్, సూర్యుడు, భూమి వ్యవస్థలోని లాగ్రజియన్ ఎల్ 1 పాయింట్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. తాజాగా ఈ పాయింట్ ని చేరుకోవడానికి మరింత దగ్గరయ్యింది ఆదిత్య- ఎల్ 1 మిషన్. ఇస్రో శాస్త్రవేత్తలు నాలుగవ సారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని చేపట్టి లాగ్రజియన్ పాయింట్ వైపు మిషన్ ని పంపించారు. భూమి నుండి 256 km x 121973 కిలో మీటర్ల కక్ష్యలోకి ఆదిత్య- ఎల్ 1 మిషన్ చేరుకుందని ఇస్రో తెలియజేసింది. అంతేకాదు సెప్టెంబర్ 19వ తేదీన ఐదవ భూకక్ష్య పెంపు విన్యాసం ఉంటుందని ఇస్రో తెలిపింది.