ఆదిత్య-ఎల్1: భూమిని పూర్తిగా దాటేసి.. లగ్రేంజియన్ పాయింట్ వైపు ప్రయాణం
సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఆదిత్య-ఎల్1 మిషన్ ని ఇస్రో ప్రయోగించింది. సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరి కోట నుండి సూర్యుడు, భూమి వ్యవస్థలోని లగ్రేంజియన్ పాయింట్ వైపు మిషన్ ప్రయాణం మొదలైంది. ఇప్పటివరకు నాలుగు కక్ష్య పెంపు విన్యాసాలు పూర్తయ్యాయి. తాజాగా ఐదవ కక్ష్య పెంపు విన్యాసంతో భూమి కక్ష్యను దాటిపోయి ట్రాన్స్ లగ్రేంజియన్ పాయింట్ 1 వైపు ప్రయాణం మొదలైంది. ఈరోజు ఉదయం ఐదవ కక్ష్య పెంపు విన్యాసాన్ని శాస్త్రవేత్తలు నిర్వహించారు. మరొక 110రోజుల ప్రయాణం తర్వాత లగ్రేంజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలోకి మిషన్ చేరుకోనుందని ఇస్రో వెల్లడి చేసింది. లగ్రేంజియన్ పాయింట్ 1 కి చేరుకున్నాక సూర్యుడి మీద పరిశోధనలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేసారు.