LOADING...
Adobe: భారత విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. అడోబ్ నుంచి ఉచిత సాఫ్ట్‌వేర్‌లు!
భారత విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. అడోబ్ నుంచి ఉచిత సాఫ్ట్‌వేర్‌లు!

Adobe: భారత విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. అడోబ్ నుంచి ఉచిత సాఫ్ట్‌వేర్‌లు!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

అడోబ్‌ సంస్థ భారత విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్ ఇచ్చింది. దేశంలోని గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఫోటోషాప్‌, అక్రోబాట్‌, ఫైర్‌ఫ్లై ఏఐ వంటి తమ ప్రధాన సాఫ్ట్‌వేర్‌లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 19న జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. దేశంలో ఏఐ ఆధారిత సృజనాత్మకత, ఉత్పాదకతను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఇది ఒక వ్యూహాత్మక పెట్టుబడిగా అడోబ్ పేర్కొంది. సాఫ్ట్‌వేర్‌లతో పాటు వాటిని ఎలా ఉపయోగించాలో ప్రత్యేక పాఠ్య ప్రణాళికను కూడా విద్యార్థులకు అందించనుంది. 2026 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఉన్న 15 వేల పాఠశాలలు,500 కళాశాలల విద్యార్థులకు ఈ "ఏఐ ఫస్ట్" ఆఫర్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

వివరాలు 

ఐటీ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్ అమలు

2030 నాటికి యానిమేషన్‌, విజువల్ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ (AVGC) రంగాల్లో ఉద్యోగాల సృష్టికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని సంస్థ తెలిపింది. భారతదేశ వ్యాప్తంగా లక్షలాది విద్యార్థులకు సృజనాత్మక అవకాశాలను విస్తరించి, వారికి ఏఐ నైపుణ్యాలను అందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు మద్దతు ఇస్తున్నామని అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్‌,ఐటీ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్న నాస్‌కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్ అమలు కానుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉచిత కోర్సులు, సర్టిఫికేషన్లు అందించడంతో పాటు గ్రాఫిక్ డిజైన్‌, యానిమేషన్‌ నుంచి మార్కెటింగ్‌, టెక్నాలజీ వరకు వివిధ రంగాలకు సరిపోయే శిక్షణ మాడ్యూల్‌లు రూపొందించనున్నారు.

Advertisement