LOADING...
IIT Guwahati: అంతర్జాతీయ సరిహద్దుల భద్రతకు ఏఐ ఆధారిత రోబోలు.. ఐఐటీ గువాహటి సంచలన ఆవిష్కరణ
అంతర్జాతీయ సరిహద్దుల భద్రతకు ఏఐ ఆధారిత రోబోలు.. ఐఐటీ గువాహటి సంచలన ఆవిష్కరణ

IIT Guwahati: అంతర్జాతీయ సరిహద్దుల భద్రతకు ఏఐ ఆధారిత రోబోలు.. ఐఐటీ గువాహటి సంచలన ఆవిష్కరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2025
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ సరిహద్దుల వద్ద భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు అస్సాంలోని గువాహటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పరిశోధకులు అధునాతన ఏఐ (AI) ఆధారిత రోబోలను అభివృద్ధి చేశారు. సరిహద్దు భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ రోబోలు ప్రయోజనం చేకూరిస్తాయని అధికారులు వెల్లడించారు. డీఏ స్పాటియో రోబోటిక్ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ (DSRL) అనే స్టార్టప్‌ అభివృద్ధి చేసిన ఈ రోబోలు, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) నుంచి గుర్తింపు పొందాయి. భారత సైన్యం ఇప్పటికే ఈ నిఘా వ్యవస్థ కోసం 'ఫీల్డ్ ట్రయల్స్' నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Details

సమర్థవంతంగా పనిచేస్తాయి

DSRL సీఈఓ అర్నబ్ కుమార్ బర్మాన్ మాట్లాడుతూ, సంప్రదాయ మాన్యువల్ పెట్రోలింగ్‌కు భిన్నంగా, ఈ రోబోలు స్వయంప్రతిపత్త వ్యవస్థను కలిగి ఉంటాయని తెలిపారు. ఇవి అన్ని వాతావరణ పరిస్థితుల్లో సమర్థవంతంగా పని చేస్తాయని వివరించారు. నావిగేషన్, ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థ అంతర్జాతీయ సరిహద్దు భద్రత, కీలక మౌలిక సదుపాయాల నిఘా, వ్యూహాత్మక రక్షణలో విప్లవాత్మక మార్పుని తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Details

డ్రోన్ దాడులు, చొరబాట్లను గుర్తించే రోబోలు 

అంతర్జాతీయ సరిహద్దుల్లో దుండగులు డ్రోన్‌లను పంపడం, చొరబాట్లకు ప్రయత్నించడం వంటివి చేస్తే, ఈ రోబోలు సెన్సర్ల ద్వారా వెంటనే గుర్తించి అలర్ట్ చేస్తాయి. ఈ రోబో నిఘా వ్యవస్థ జాతీయ భద్రతను మరింత బలోపేతం చేస్తుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అధునాతన ఆవిష్కరణలపై నిరంతరం కృషి చేస్తామని బర్మాన్ వెల్లడించారు.