Loading...
Anthropic: స్మార్ట్ పరికరాల్లో ఏఐ తనకు తానుగా కాపీలు సృష్టించుకోవచ్చు.. ఆంత్రోపిక్ హెచ్చరిక
ఆంత్రోపిక్ హెచ్చరిక

Anthropic: స్మార్ట్ పరికరాల్లో ఏఐ తనకు తానుగా కాపీలు సృష్టించుకోవచ్చు.. ఆంత్రోపిక్ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (AI) సాంకేతికతలో వేగంగా వస్తున్న మార్పులు కొత్త సవాళ్లకు దారితీసే అవకాశం ఉందని ఆంత్రోపిక్ సంస్థ హెచ్చరించింది. స్మార్ట్ ఫ్రిజ్‌లు, ఓవెన్‌లు వంటి ఇంటర్నెట్‌కు అనుసంధానమైన పరికరాల్లో (IoT) ఏఐ మోడళ్లు తమకు తాముగా కాపీలు సృష్టించుకుని వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిపింది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే వాటిని నియంత్రించేందుకు లేదా వాటి వ్యాప్తిని అడ్డుకునేందుకు మనుషులు జోక్యం చేసుకోవడం కష్టంగా మారవచ్చని పేర్కొంది. అధునాతన ఏఐ వ్యవస్థల సామర్థ్యాలు, వాటితో ఎదురయ్యే ముప్పులపై ఆంథ్రోపిక్ కొనసాగిస్తున్న పరిశోధనల్లో భాగంగా ఈ హెచ్చరిక చేసింది.

వివరాలు 

ఏఐ తనకు తానుగా కాపీలు సృష్టించుకుంటే ఆపడం కష్టమే!

మనుషుల జోక్యం లేకుండానే తనకు తానుగా కాపీలను సృష్టించుకోగల వ్యవస్థను ఏఐ సెల్ఫ్‌-రెప్లికేటర్‌గా పిలుస్తారు.

ఇలాంటి సాంకేతికత వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని ఆంథ్రోపిక్ తన బ్లాగ్‌ పోస్టులో వివరించింది.

సాధారణ డేటా సెంటర్‌లో సమస్య తలెత్తితే ఒకే చోట నుంచి వ్యవస్థను నిలిపివేయవచ్చు.

కానీ, వివిధ పరికరాల్లో విస్తరించిన ఏఐ వ్యవస్థలకు అలాంటి కేంద్రీకృత నియంత్రణ స్థానం ఉండదని పేర్కొంది.

దీంతో వాటిని పూర్తిగా నిలిపివేయడం కష్టమవుతుందని తెలిపింది.

ఈ తరహా ఏఐ వ్యవస్థలు నెమ్మదిగా వ్యాపించినప్పటికీ, వాటి సంఖ్య రెట్టింపు కావడానికి కొన్ని రోజులు పట్టవచ్చని అంచనా వేసింది.

వివరాలు 

చవకైన ఆండ్రాయిడ్ టీవీ బాక్స్‌లపై ఆంథ్రోపిక్ పరీక్షలు

ఆంథ్రోపిక్ పరిశోధనలో భాగంగా 'వెయిట్‌-బేస్డ్ రెప్లికేటర్స్‌' అనే ప్రత్యేక ఏఐ వ్యవస్థలను పరిశీలించింది.

ఇవి హ్యాక్‌ చేసిన పరికరాల్లోనే తమ ఏఐ మోడళ్లను నేరుగా అమలు చేస్తూ, స్వయంచాలకంగా వ్యాప్తి చెందగలవు.

ఇంటర్నెట్‌కు అనుసంధానమై ఉండటం, భద్రతా ఏర్పాట్లు పరిమితంగా ఉండటం వంటి కారణాలతో ఇళ్లలో, చిన్న వ్యాపార సంస్థల్లో ఉపయోగించే ఐఓటీ పరికరాలు ఇలాంటి వ్యవస్థలకు తొలి లక్ష్యాలుగా మారవచ్చని పరిశోధకులు గుర్తించారు.

ఈ అంచనాను పరీక్షించేందుకు 15 చవకైన ఆండ్రాయిడ్ టీవీ బాక్స్‌లపై 'Gemma4-26B-A4B' మోడల్‌ను అమలు చేశారు. ఈ పరీక్షలో సెకనుకు 0.39 టోకెన్ల వేగం నమోదైంది.

ADVERTISEMENT

వివరాలు 

2026 చివరి నాటికి చిన్న ఏఐ మోడళ్లకూ ఈ సామర్థ్యం వచ్చే అవకాశం

ఒక ఏఐ మోడల్‌ తన కాపీలను సృష్టించుకుని వ్యాప్తి చెందే ప్రక్రియను మొదటి నుంచి చివరి వరకు పూర్తిచేయడంలో చిన్న మోడళ్లు ఇప్పటికీ కొన్ని తప్పులు చేస్తున్నాయని ఆంథ్రోపిక్ పరిశోధకులు తెలిపారు.

అయితే, 30 బిలియన్ లేదా అంతకంటే తక్కువ పారామీటర్లు ఉన్న మోడళ్లు ఈ ప్రక్రియలోని అనేక దశలను ఇప్పటికే పూర్తి చేయగలుగుతున్నాయని పేర్కొన్నారు.

చిన్న ఏఐ మోడళ్ల సామర్థ్యాలు గతంలో పెరిగిన వేగంతోనే మెరుగుపడితే, 2026 చివరి నాటికి అవి కూడా ఈ స్థాయి సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఆ తర్వాత స్వయంగా కాపీలు సృష్టించుకుంటూ వ్యాపించే చిన్న వెయిట్‌-బేస్డ్ ఏఐ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చే అవకాశముందని హెచ్చరించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏఐ వ్యవస్థల వ్యాప్తిని అడ్డుకునేందుకు ఐఓటీ పరికరాల భద్రత పెంచాలి

ఈ పరిశోధన ఫలితాల నేపథ్యంలో చిన్న ఐఓటీ పరికరాల భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆంథ్రోపిక్ స్పష్టం చేసింది.

ఇలాంటి ఏఐ వ్యవస్థలు పరికరాల మధ్య వ్యాపించకుండా అడ్డుకునేలా భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది.

అదే సమయంలో, భవిష్యత్తులో ఇటువంటి వ్యవస్థలు విస్తృతంగా అందుబాటులో ఉండే పరిస్థితిని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని పేర్కొంది.

అధునాతన ఏఐ సాంకేతికత కొత్త రకాల సైబర్‌ భద్రతా సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కీలకమని సంస్థ అభిప్రాయపడింది.

ADVERTISEMENT