Alexa Plus: ఏ విషయంపైనైనా AI పోడ్‌కాస్ట్‌లు.. అలెక్సా ప్లస్‌లో కొత్త ఫీచర్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికన్ టెక్ దిగ్గజం అమెజాన్ తన AI అసిస్టెంట్ 'అలెక్సా ప్లస్'కు భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది. అలెక్సా ప్లస్ (Alexa Plus)లో కొత్తగా "అలెక్సా పోడ్‌కాస్ట్్స్" అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకి ఆసక్తి ఉన్న ఏ విషయంపైనైనా AI ఆధారిత పోడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లను రూపొందించుకోవచ్చు. యూజర్ ఏదైనా టాపిక్‌ను అలెక్సాకు చెప్పగానే, ఆ విషయంపై సమాచారం సేకరించి, రీసెర్చ్ చేసి, ఆ ఎపిసోడ్‌లో ఏమేమి ఉండబోతున్నాయో ముందుగా చిన్న వివరణ ఇస్తుంది. అంతేకాదు, ఈ పోడ్‌కాస్ట్‌లను యూజర్లు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
వివరాలు
పోడ్‌కాస్ట్‌ల సమాచారం కోసం 200 వార్తా సంస్థల డేటా
ఎపిసోడ్ నిడివి, టోన్, ముఖ్యాంశాలు వంటి అంశాలను మార్చుకోవచ్చు. అన్ని సెట్టింగ్స్ పూర్తి చేసిన తర్వాత, AI ద్వారా రూపొందించిన హోస్ట్ వాయిస్‌లతో పోడ్‌కాస్ట్‌ను అలెక్సా ప్లస్ వినిపిస్తుంది. ఎపిసోడ్ సిద్ధమైన వెంటనే ఎకో షో డివైస్‌లతో పాటు అలెక్సా యాప్‌లో నోటిఫికేషన్ వస్తుంది. AI రూపొందించే ఈ పోడ్‌కాస్ట్‌ల సమాచారం నమ్మదగినదిగా ఉండేందుకు సుమారు 200 వార్తా సంస్థల డేటాను ఉపయోగిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఇందులో Reuters, Associated Press, The Washington Post, Vox Media, Politico వంటి ప్రముఖ మీడియా సంస్థల సమాచారం ఉంటుందని పేర్కొంది. దీంతో AI పోడ్‌కాస్ట్‌ల విశ్వసనీయతపై ఉన్న సందేహాలు తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది.
వివరాలు
అలెక్సా ప్లస్‌ను వ్యక్తిగత AI కంటెంట్ క్రియేటర్‌గా మార్చే దిశగా అమెజాన్
ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను అమెరికాలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎకో షో డివైస్ లేదా అలెక్సా యాప్ ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు. తయారైన పోడ్‌కాస్ట్‌లు యాప్‌లోని "మ్యూజిక్", "మోర్" విభాగాల్లో సేవ్ అవుతాయి. భవిష్యత్తులో అలెక్సా ప్లస్‌ను కేవలం వాయిస్ అసిస్టెంట్‌గా కాకుండా, వ్యక్తిగత AI కంటెంట్ క్రియేటర్‌గా మార్చే దిశగా అమెజాన్ ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.