
Nasa: అంగారక గ్రహంపై పుర్రె ఆకారపు నిర్మాణం.. నాసా శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
ఈ వార్తాకథనం ఏంటి
అంగారక గ్రహంపై ఏలియన్ అవశేషాలు ఉన్నాయా అనే అనుమానాలు మరోసారి మళ్లీ తెరపైకి వచ్చాయి.
ఇటీవల నాసాకు చెందిన పెర్సెవెరెన్స్ రోవర్ అక్కడ ఒక ప్రత్యేక ఆకారంలో ఉన్న రాయిని గుర్తించింది.
ఆ రాయి మనుషుల కపాలంలా ఉండడం గమనార్హం. పెర్సెవెరెన్స్ రోవర్‌ను నాసా, 2020లో ప్రారంభించిన మార్స్ మిషన్‌లో భాగంగా, అంగారక గ్రహంపై జెజెరో క్రేటర్‌ను అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో పంపింది.
ఇది కారుకి సమానమైన పరిమాణంలో ఉండే రోవర్. ఇది అంగారక గ్రహంపై విస్తృతంగా తిరుగుతూ పలు పరిశోధనలు జరుపుతోంది.
వివరాలు
పొడి మైదానంగా..
ఏప్రిల్ 11న, ఈ రోవర్ గుర్తించిన ఆ ప్రత్యేకమైన రాయి ఇప్పుడు సంచలనంగా మారింది.
కపాలంలా ఉన్న ఆ ఆకారం చూసిన కొందరు పరిశోధకులు,అది ఏలియన్లకు చెందిన అవశేషమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఈ రాయిని జెజెరో క్రేటర్‌లోని 'విచ్ హాజెల్ హిల్' ప్రాంతంలో రోవర్ తిరుగుతున్న సమయంలో గుర్తించారు.
ప్రస్తుతానికి ఆ రాయికి "స్కల్ హిల్" అనే పేరును శాస్త్రవేత్తలు ఇచ్చారు.
జెజెరో క్రేటర్ సుమారుగా 28 మైళ్ల వెడల్పుతో ఉంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం ఓ సరస్సుగా ఉండేది.
కానీ కాలక్రమేణా వాతావరణ మార్పుల కారణంగా ఇది పొడి మైదానంగా మారిపోయింది.
వివరాలు
"స్కల్ హిల్" రంగు డార్క్‌గా..
'స్కల్ హిల్' అనే రాయి అక్కడున్న మిగిలిన రాళ్లతో పోలిస్తే పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.
ఇది పూర్తి స్థాయిలో రాయిలా కనిపించదు. దీనికి మిగతా రాళ్లతో పోల్చితే వేరుగా ఉంది.
ఈ రాయి డార్క్ కలర్ ఉండగా, దాని ఉపరితలంపై చిన్న చిన్న రంధ్రాలూ కనిపిస్తున్నాయి.
ప్రారంభంలో శాస్త్రవేత్తలు ఈ రాయిని ఉల్క అనుకున్నారు. కానీ రోవర్‌లో అమర్చిన శక్తివంతమైన కెమెరా ద్వారా కెమికల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇది ఉల్క కాదని తేలింది.
స్కల్ హిల్ ఎలా వచ్చిందో, ఇది ఎక్కడి నుంచి వచ్చినదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు మరింత లోతైన పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.