LOADING...
Milky Way galaxy: నక్షత్రాల పుట్టుక వెనుక అసలు కథ బయటపెట్టిన తాజా పరిశోధన
నక్షత్రాల పుట్టుక వెనుక అసలు కథ బయటపెట్టిన తాజా పరిశోధన

Milky Way galaxy: నక్షత్రాల పుట్టుక వెనుక అసలు కథ బయటపెట్టిన తాజా పరిశోధన

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2026
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన సౌరవ్యవస్థకు ఆవాసమైన విశాలమైన మిల్కీవే గెలాక్సీకి సంబంధించిన అద్భుత దృశ్యాన్ని శాస్త్రవేత్తలు చరిత్రలోనే ఎప్పుడూ లేనంత స్పష్టతతో బంధించారు. చిలీలో ఉన్నఅటకామా లార్జ్ మిల్లీమీటర్/సబ్‌మిల్లీమీటర్ అర్రే(అల్మా)రేడియో టెలిస్కోప్‌తో తీసిన ఈ చిత్రం ఇప్పటివరకు సాధించిన అతిపెద్ద ఫోటోగా ప్రాజెక్ట్ బృందం వెల్లడించింది. ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త స్టీవెన్ లాంగ్‌మోర్ మాట్లాడుతూ,ఇది కేవలం అంతరిక్ష సౌందర్యాన్నిచూపించే చిత్రం మాత్రమే కాకుండా,మన గ్రహం ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోవడంలో కూడా ఎంతో కీలకమని చెప్పారు. మన గెలాక్సీ మధ్యలో ఉన్న అధిక వేడి,భారీ ఒత్తిడి,గ్యాస్ మేఘాల తీవ్ర గందరగోళ పరిస్థితులు పాత విశ్వంలో నక్షత్రాలు పుట్టిన సమయంతో పోలి ఉన్నాయని ఆయన చెప్పారు.

vivaralu

గ్యాస్ మేఘాల నుంచి గ్రహాల దాకా.. గెలాక్సీ మధ్యలో అసలు లింక్ బయటపడింది

దూరంగా ఉన్న ఆ గెలాక్సీల్లో నక్షత్రాలు,గ్రహాలు ఎలా పుడుతున్నాయో నేరుగా చూడలేమని, కానీ మన గెలాక్సీ మధ్యలో మాత్రం చూడగలిగామని తెలిపారు. "ఇంతకుముందు నగరానికి మ్యాప్ లేకుండా కొన్ని వీధుల ఫోటోలు మాత్రమే ఉన్నట్లుండేది. ఇప్పుడు మొత్తం దృశ్యం కనిపిస్తోంది" అని లాంగ్‌మోర్ వ్యాఖ్యానించారు. గ్యాస్ మేఘాలు ఒకచోట,నక్షత్రాలు పుడుతున్న ప్రాంతాలు ఇంకోచోట ఇలా విడివిడిగా మాత్రమే కనిపించేవి.. కానీ అవన్నీ పరస్పరం ఎలా కలిసిపోయి ఉన్నాయో,ఏ విధంగా సంబంధం ఉందో ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదని ఆయన తెలిపారు. అల్మా CMZ ఎక్స్‌ప్లోరేషన్ సర్వేలో 160 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా కలిసి పని చేశారు. టెలిస్కోప్ గుర్తించిన పొడవైన, పలుచని పదార్థ ప్రవాహాలు నక్షత్రాలు,గ్రహాలు ఏర్పడటానికి దారితీస్తున్నాయని తెలిసి ఆశ్చర్యపోయామని తెలిపారు.

వివరాలు 

వెబ్ టెలిస్కోప్‌పై ఆశలు.. కానీ అవకాశాలు చాలా తక్కువ!

ఈ చిత్రం శాస్త్రీయంగా మాత్రమే కాకుండా చూడటానికి కూడా ఎంతో అందంగా ఉందని లాంగ్‌మోర్ అన్నారు. ఇకపై మరింత స్పష్టమైన వివరాల కోసం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లేదా చిలీలో నిర్మాణంలో ఉన్న చాలా పెద్ద టెలిస్కోప్ సహాయంతో పరిశీలనలు చేయాలని బృందం భావిస్తోంది. వేర్వేరు వేవ్‌లెంగ్త్స్ తీసిన పరిశీలనలను కలిపితే రంగుల చిత్రాలు రూపొందించి, గ్యాస్ మేఘాలు ఢీకొన్న ప్రాంతాల్లో కొత్త నక్షత్రాలు ఎలా పుడుతున్నాయో కారణ-ఫలితాలను స్పష్టంగా తెలుసుకోవచ్చని చెప్పారు. అయితే వెబ్ టెలిస్కోప్ పరిశీలన సమయం కోసం భారీ పోటీ ఉండటంతో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని లాంగ్‌మోర్ వెల్లడించారు.

Advertisement