LOADING...
Amazon Leo: అమెజాన్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు రంగం సిద్ధం.. త్వరలో ప్రారంభం
అమెజాన్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు రంగం సిద్ధం.. త్వరలో ప్రారంభం

Amazon Leo: అమెజాన్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు రంగం సిద్ధం.. త్వరలో ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2026
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెజాన్ తన తక్కువ భూ కక్ష్య(Low Earth Orbit-LEO)ఉపగ్రహాల నెట్‌వర్క్ 'అమెజాన్ లియో' ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. కంపెనీ 396వ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి పంపిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ప్రస్తుతం కక్ష్యలో ఉన్న ఉపగ్రహాల సంఖ్య ప్రారంభ దశలో నిర్ణయించిన అక్షాంశాల పరిధిలో నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలు అందించడానికి సరిపోతుందని అమెజాన్ లియో బిజినెస్, ప్రొడక్ట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ క్రిస్ వెబర్ వెల్లడించారు. అమెజాన్ లక్ష్యం ప్రకారం 2026మధ్య నాటికి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు సంస్థ వేగంగా ముందుకు సాగుతోంది. అయితే సేవలు ప్రారంభమైన వెంటనే పూర్తి స్థాయి పనితీరు అందుబాటులోకి వస్తుందని వినియోగదారులు ఆశించవద్దని క్రిస్ వెబర్ స్పష్టం చేశారు.

వివరాలు 

2020లో "Better than Nothing Beta" పేరుతో తొలి దశ సేవల ప్రారంభం 

భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి సేవల సామర్థ్యం, వేగాన్ని మరింత పెంచనున్నట్లు తెలిపారు. ఈ వ్యూహం స్పేస్‌-X అనుసరించిన విధానాన్నే పోలి ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్పేస్‌-X 2020లో దాదాపు 900 స్టార్‌లింక్ ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్న సమయంలో "Better than Nothing Beta" పేరుతో తొలి దశ సేవలను ప్రారంభించింది. అనంతరం ఉపగ్రహాల సంఖ్యను పెంచుతూ సేవల నాణ్యతను గణనీయంగా మెరుగుపరిచింది. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ ప్రపంచ శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో అగ్రస్థానంలో ఉంది. కంపెనీ 10,000కు పైగా స్టార్‌లింక్ ఉపగ్రహాలను నిర్వహిస్తూ 160కిపైగా దేశాల్లో భూమి, సముద్రం, విమానాల్లో కూడా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది.

వివరాలు 

ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 3,232 లియో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని అమెజాన్ లక్ష్యం

స్టార్‌లింక్‌లో సగటు డౌన్‌లోడ్ వేగం సుమారు 200 Mbps ఉండగా, అప్‌లోడ్ వేగం 10 నుంచి 40 Mbps వరకు, లేటెన్సీ సుమారు 25 మిల్లీ సెకన్లు నమోదవుతోంది. ఈ స్థాయి పనితీరును అందుకోవాలంటే అమెజాన్ లియోకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 3,232 లియో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉపగ్రహాలన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను మరింత విస్తృతంగా అందించాలని కంపెనీ యోచిస్తోంది.

Advertisement