
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణలో అమెరికాకు ఎదురవుతున్న అడ్డంకులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్.. సాంకేతిక రంగంలో మనిషి దూసుకుపోతున్నాడని చెప్పడానికి ఏఐ ని మించిన ఉదాహరణ ఇంకొకటి లేదు.
అయితే సాంకేతికతను ప్రజలు ఉపయోగించుకునేటప్పుడు వాటిని నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. లేదంటే అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఛాట్ బాట్, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు తీసుకున్న ఏఐ మీద నియంత్రణ ఉండాలని అమెరికా ప్రభుత్వం ఆశిస్తోంది. ఇప్పటికే చైనా, ఇంకా ఇతర దేశాలు ఏఐ మీద నియంత్రణ చేయాలని భావిస్తున్నాయి.
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద నియంత్రణ కోసం పోయిన ఏడాది అమెరికా ప్రభుత్వం, ఏఐ బిల్ ఆఫ్ రైట్స్ అనే పేరుతో ఒక రకమైన సూచనలను తీసుకొచ్చింది.
Details
సోషల్ మీడియా విషయంలో చేసిన తప్పును ఏఐలో చేయకూడదని భావిస్తున్న అమెరికా
ఏఐ ని నియంత్రించడానికి ఒక చట్టాన్ని తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. దానికన్నా ముందు అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాలని అనుకుంటోంది.
ఏఐ ని నియంత్రించే నియమాలు ప్రాథమిక హక్కులను భంగలం కలిగించకుండా ఉండాలని, అలాగే ఏఐ ని తయారు చేసిన వారి మీద నియంత్రణ విధించాలా లేక వాడుతున్న వారిమీద విధించాలా అని అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఇప్పటికే ఏఐ లీడర్లయిన ఓపెన్ ఏఐ, ఆంథోర్పిక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థల సీఈవోలతో జో బైడెన్ సమావేశమయ్యారు. సోషల్ మీడియాను నియంత్రించడంలో చేసిన ఆలస్యాన్ని ఏఐ ని నియంత్రించడంలో చేయకూడదని అమెరికా భావిస్తోంది.