ISRO: ఇస్రో మరో కీలక అడుగు.. సూర్యడిపై ప్రోబా-3 ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోంది. శాస్త్రసాంకేతిక రంగంలో అనేక విజయాలను సాధించిన ఇస్రో, ఇప్పుడు సూర్యుడికి సంబంధించిన పరిశోధనలో కృషి చేయడానికి నిర్ణయించింది. ఈ ప్రయోగంలో ముఖ్యంగా సూర్యుని చుట్టూ కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఇస్రో తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)తో కలిసి ప్రోబా - త్రీ మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ మిషన్ ద్వారా ఇస్రో, సూర్యుడి బాహ్య వలయం, కొరోనోను గమనించి, కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. ఇది విశ్వంలో ఏకమాత్రం లభించే ఒక శాస్త్ర పరిశోధనగా స్మార్త్గా నిలిచే అవకాశం ఉంది. ప్రోబా - త్రీ మిషన్‌లో రెండు ప్రత్యేక ఉపగ్రహాలు ఉన్నాయి.
డిసెంబర్ 4న సాయంత్రం 4 గంటలకు ప్రయోగం
ఓ కల్టర్ శాటిలైట్, ఒక కొరోనో గ్రాఫ్ శాటిలైట్. ఈ ఉపగ్రహాలు ఒకే లైనులో ఉండి, 60 వేల కిలోమీటర్ల దూరంలో, తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉన్న ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉపగ్రహం స్థిరంగా ఉంటూ, సూర్యుడి వెలుగును అడ్డుకుంటుంది, తద్వారా కృత్రిమ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడు బాహ్య వలయంలోని వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. సౌరతుఫానులు, కొరోనో నుండి విడుదలయ్యే సౌరవ్యర్థాలు భూమి మీద ఉన్న పవర్ గ్రిడ్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలకు ఏ రకమైన ప్రభావం చూపిస్తాయో అంచనా వేయగలుగుతారు. త్రీ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఈనెల 4న సాయంత్రం 4 గంటలకు ముహూర్తంగా ఎంచుకుంది.
సూర్యుని చుట్టూ వాతావరణ పరిస్థితులు తెలుసుకొనే అవకాశం
ఇంతటి ప్రతిష్టాత్మక ప్రయోగం ద్వారా, సూర్యుడు, కొరోనో మధ్య జరిగే మార్పులను పరిశీలించవచ్చు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే, సూర్యుని చుట్టూ ఉన్న పరిసర వాతావరణం, అక్కడ జరిగే మార్పులపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇస్రో ప్రపంచంలోని ఇతర దేశాలకు కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటూ, సౌర పరిశోధన రంగంలో విప్లవాత్మకమైన అడుగులు వేస్తోంది. ప్రోబా - త్రీ ప్రయోగం విజయవంతంగా ముగిసితే, సూర్యుడి కాంతి, కొరోనో వాతావరణం, సూర్యగ్రహణాలు, మరియు వారి ప్రభావం గురించి మరింత లోతుగా అవగాహన పెరుగుతుంది. ఇది భారత శాస్త్రజ్ఞానం ప్రపంచానికి పరిచయం చేసే మరొక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది.