Loading...
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. ఇక కాంటాక్ట్స్ వెతకడం మరింత ఈజీ!
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. ఇక కాంటాక్ట్స్ వెతకడం మరింత ఈజీ!

WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. ఇక కాంటాక్ట్స్ వెతకడం మరింత ఈజీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. యూజర్లు తమ కాంటాక్ట్స్‌ను సులభంగా వెతకడంతో పాటు వాటిని క్రమబద్ధంగా నిర్వహించుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా 'కాంటాక్ట్స్‌ ట్యాబ్‌'ను అభివృద్ధి చేస్తున్నట్లు టెక్‌ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే కాంటాక్ట్స్‌కు సంబంధించిన అనేక సదుపాయాలను ఒకే స్క్రీన్‌పై ఉపయోగించుకోవచ్చు.

వివరాలు

పేరు, నంబర్‌, యూజర్‌నేమ్‌తో సెర్చ్‌..

కొత్త కాంటాక్ట్స్‌ ట్యాబ్‌లో పైభాగంలో సెర్చ్‌ బార్‌ ఉండనుంది. దీని సాయంతో యూజర్లు తమకు కావాల్సిన వ్యక్తులను వారి పేరు, ఫోన్‌ నంబర్‌ లేదా యూజర్‌నేమ్‌ ద్వారా సులభంగా వెతకవచ్చు.

అంతేకాకుండా కాంటాక్ట్స్‌ను అక్షరక్రమం లేదా వారి యాక్టివిటీ ఆధారంగా క్రమబద్ధీకరించుకునే ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

దీంతో పెద్ద సంఖ్యలో కాంటాక్ట్స్‌ ఉన్నవారికి కావాల్సిన వ్యక్తిని గుర్తించడం మరింత సులభం కానుంది.

వివరాలు

ఆన్‌లైన్‌ స్టేటస్‌.. పుట్టినరోజు రిమైండర్లు!

ఈ కొత్త ఫీచర్‌లో కాంటాక్ట్‌ ప్రొఫైల్‌ ఫొటో పక్కన గ్రీన్‌ డాట్‌ కనిపించనుంది. దీని ద్వారా ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్నారో లేదో వెంటనే తెలుసుకోవచ్చు.

అలాగే కాంటాక్ట్స్‌లో ఎవరికైనా పుట్టినరోజు ఉంటే కేక్‌ ఎమోజీతో పాటు 'Birthday today' అనే లేబుల్‌ కనిపిస్తుంది.

దీంతో పుట్టినరోజులను గుర్తుంచుకోవడంతో పాటు అదే స్క్రీన్‌ నుంచి నేరుగా వారికి విషెస్‌ పంపే అవకాశం కూడా ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

మెటా ఏఐ.. 'ఇన్వైట్‌ ఏ ఫ్రెండ్‌' ఆప్షన్లు!

కాంటాక్ట్స్‌ జాబితా చివర్లో మెటా ఏఐ (Meta AI)ని ఉపయోగించుకునేందుకు లింక్‌ ఉండనుంది.

దీంతో పాటు ఇతరులను వాట్సాప్‌లో చేరమని ఆహ్వానించేందుకు 'Invite a friend' అనే ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉండనుంది.

ఈ రెండు సదుపాయాల ద్వారా యూజర్లు ఒకే ట్యాబ్‌ నుంచి అదనపు సేవలను సులభంగా యాక్సెస్‌ చేయవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

ప్రైవసీ సెట్టింగ్స్‌కు ప్రాధాన్యం..

కొత్త కాంటాక్ట్స్‌ ట్యాబ్‌లోనూ వాట్సాప్‌ ఇప్పటికే అమలు చేస్తున్న ప్రైవసీ సెట్టింగ్స్‌ కొనసాగనున్నాయి.

ఆన్‌లైన్‌ స్టేటస్‌ లేదా లాస్ట్‌ సీన్‌ వివరాలను ఇతరులకు కనిపించకుండా దాచుకున్న యూజర్లకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఫీచర్‌ ద్వారా కూడా ఇతరులు చూడలేరు.

అంటే, యూజర్లు తమ ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఎంచుకున్న పరిమితులకు అనుగుణంగానే సమాచారం కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ కాంటాక్ట్స్‌ ట్యాబ్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో అభివృద్ధి దశలో ఉంది. అయితే, ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ ఎప్పుడు అధికారికంగా విడుదల చేస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

విడుదల తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ADVERTISEMENT