తదుపరి వార్తా కథనం

SpaceX Starship: ఎలాన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ… స్టార్‌షిప్ రాకెట్ మళ్లీ పేలిపోయింది
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 28, 2025
09:01 am
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్ష పరిశోధనలో ఆధిపత్యాన్ని బలపరచాలనే లక్ష్యంతో ముందడుగేస్తున్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
దీర్ఘదూర అంతరిక్ష ప్రయాణాల కోసం రూపొందించిన స్టార్‌షిప్ (Starship) మెగా రాకెట్ తాజా పరీక్షలో విఫలమైంది.
ప్రారంభ దశలో ఇది విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినప్పటికీ, సుమారు అరగంట తర్వాత రాకెట్ గాల్లోనే పేలిపోయింది.
వరుసగా మూడోసారి స్టార్‌షిప్ రాకెట్ ఈ విధంగా విఫలం కావడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మరోసారి విఫలమైన స్టార్ షిప్ రాకెట్
Liftoff of Starship! pic.twitter.com/aXAwLkRbuK
— SpaceX (@SpaceX) May 27, 2025