Loading...
Anthropic: జీవాయుధాల నుంచి మిసైళ్ల తయారీ?.. ఏఐ దుర్వినియోగంపై సంచలన నివేదిక
జీవాయుధాల నుంచి మిసైళ్ల తయారీ?.. ఏఐ దుర్వినియోగంపై సంచలన నివేదిక

Anthropic: జీవాయుధాల నుంచి మిసైళ్ల తయారీ?.. ఏఐ దుర్వినియోగంపై సంచలన నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) మానవాళి అభివృద్ధికి దోహదపడుతున్నప్పటికీ.. దాని దుర్వినియోగంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో నైపుణ్యం కలిగిన కార్మికుల ఉపాధిపై ఏఐ ప్రభావం చూపుతుందనే చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సాంకేతికతను ప్రమాదకరమైన జీవ, సైబర్‌, సైనిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారనే నివేదిక మరింత కలవరపెడుతోంది.

వివరాలు 

ప్రమాదకర పాథోజెన్లపై పరిశోధనలకు ఏఐ సాయం

మనుషుల్లో వ్యాధులకు కారణమయ్యే ప్రమాదకర పాథోజెన్లపై పరిశోధనలు చేయడానికి కొందరు శాస్త్రవేత్తలు ఏఐ సాయం కోరినట్లు నివేదిక వెల్లడించింది.

జంతువులపై చికున్‌గున్యా వైరస్‌ పరిశోధనలోనూ ఏఐ వినియోగం జరిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు మిసైళ్లు, డ్రోన్లు, బాంబుల డిజైన్ల కోసం కూడా ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి.

ఇరాన్‌, రష్యాకు చెందిన కొన్ని ముఠాలు తప్పుడు ప్రచారాల కోసం ఏఐని వినియోగిస్తున్నట్లు కూడా సమాచారం.

ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న కొద్దీ బయో, సైబర్‌, సైనిక రంగాల్లో ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏఐ వినియోగంపై నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

Claude దుర్వినియోగంపై ఆంత్రోపిక్‌ నివేదిక

డిసెంబర్‌ 2025 నుంచి ఆగస్టు 2026 వరకు ఏఐ దుర్వినియోగానికి సంబంధించిన ప్రమాదకర కార్యకలాపాలను గుర్తించి అడ్డుకున్న ఘటనలపై ఆంత్రోపిక్‌ తాజాగా నివేదిక విడుదల చేసింది.

ప్రభుత్వాలతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న సంస్థలు, సైబర్‌ నేరగాళ్లు, ప్రచార నెట్‌వర్క్‌లు, స్పైవేర్‌ విక్రేతలు, రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు Claudeను దుర్వినియోగం చేసేందుకు చేసిన ప్రయత్నాలను ఇందులో వివరించింది.

Claude Haiku, Sonnet, Opus మోడళ్లను ఉపయోగించిన ఈ ఘటనల్లో గూఢచర్యం, భారీ స్థాయి నిఘా, సైబర్‌ దాడులు, ఆయుధాల అభివృద్ధి, బయోవెపన్స్‌ పరిశోధన, తప్పుడు ప్రచారం, డేటా చోరీ వంటి కార్యకలాపాలు ఉన్నట్లు సంస్థ తెలిపింది.

ముఖ్యంగా జీవశాస్త్ర పరిశోధనకు సంబంధించిన కొన్ని కేసులు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

చికున్‌గున్యా వైరస్‌పై పరిశోధనకు అడ్డుకట్ట

ఒక శాస్త్రవేత్త చికున్‌గున్యా వైరస్‌ను జంతువుల్లో పదేపదే సంక్రమించేలా చేసి, దానిని మరింత ప్రమాదకరంగా మార్చే 'గెయిన్‌-ఆఫ్‌-ఫంక్షన్‌' పరిశోధన కోసం గ్రాంట్‌ దరఖాస్తును సిద్ధం చేయాలని Claudeను కోరినట్లు ఆంత్రోపిక్‌ వెల్లడించింది.

ఈ అభ్యర్థనను సంస్థ అడ్డుకుంది. అయితే ఆ వినియోగదారు మూడో పక్షం ద్వారా భద్రతా నియంత్రణలను తప్పించుకున్నట్లు తెలిపింది.

మరో ఘటనలో Claude Opus మోడల్‌ను ఉపయోగించి ఆర్థోపాక్స్‌ వైరస్‌లు రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే విధానాలపై పరిశోధనకు సంబంధించిన గ్రాంట్‌ దరఖాస్తును రూపొందించినట్లు నివేదిక పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

క్షిపణుల సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిలోనూ వినియోగం

ఆయుధాల తయారీ, సైనిక కార్యకలాపాల్లో Claudeను ఉపయోగించేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్లు ఆంత్రోపిక్‌ తెలిపింది.

చైనా, రష్యా, యెమెన్‌కు సంబంధించిన ఆరు కేసులను గుర్తించినట్లు పేర్కొంది.

యెమెన్‌కు చెందిన ఓ బృందం మానవ ఇంజినీర్లకు బదులుగా Claude కోడ్‌ సహాయంతో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసినట్లు నివేదిక తెలిపింది.

2 వేల కిలోమీటర్లకు పైగా పరిధిని లక్ష్యంగా పెట్టుకున్న బహుళ దశల బాలిస్టిక్‌ క్షిపణి, హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ వాహనానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ ఇందులో ఉన్నట్లు పేర్కొంది.

అయితే ఆ రాకెట్‌ను పరీక్షించగా విఫలమైనట్లు సంస్థ వెల్లడించింది.

వివరాలు 

గూఢచర్యం, నిఘా కార్యకలాపాల్లోనూ..

భారీ స్థాయి నిఘా,గూఢచర్య కార్యకలాపాల్లోనూ Claude వినియోగించినట్లు గుర్తించామని ఆంత్రోపిక్‌ తెలిపింది.

మొత్తం తొమ్మిది నిఘా కేసులను గుర్తించినట్లు పేర్కొంది.

చైనాతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ బృందం ఉయ్‌ఘర్‌ ప్రజలు,జర్నలిస్టులను ట్రాక్‌ చేసి.. వారి ప్రొఫైళ్లను రూపొందించేందుకు WhatsApp, Telegram నుంచి సేకరించిన డేటాను ఉపయోగించినట్లు వెల్లడించింది.

ఇవే కాకుండా తప్పుడు సమాచార ప్రచారాలు, డేటా చోరీ, నకిలీ డేటింగ్‌ యాప్‌లు, ప్రత్యర్థి ఏఐ సంస్థల మోడళ్ల శిక్షణ కోసం Claudeను దుర్వినియోగం చేసిన ఘటనలను కూడా ఆంత్రోపిక్‌ తన నివేదికలో ప్రస్తావించింది.

ఏఐ సామర్థ్యాలు విస్తరిస్తున్న కొద్దీ దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మరింత పటిష్ఠమైన భద్రతా చర్యలు, కఠినమైన నిబంధనలు అవసరమనే చర్చకు ఈ నివేదిక మరింత ప్రాధాన్యం తెచ్చింది.

ADVERTISEMENT