Loading...
Anthropic AI Models: ఐపీఓకు ముందు ఆంత్రోపిక్‌ బిగ్‌ సర్‌ప్రైజ్
ఐపీఓకు ముందు ఆంత్రోపిక్‌ బిగ్‌ సర్‌ప్రైజ్

Anthropic AI Models: ఐపీఓకు ముందు ఆంత్రోపిక్‌ బిగ్‌ సర్‌ప్రైజ్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 10, 2026
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఓకు సిద్ధమవుతున్న సమయంలో ప్రముఖ AI సంస్థ ఆంత్రోపిక్‌ కీలక అడుగు వేసింది. సోమవారం Claude Fable 5.2, Claude Mythos 5.2 పేర్లతో రెండు కొత్త AI మోడల్స్‌ను విడుదల చేసింది. వేగంగా పెరుగుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరుచుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త మోడల్స్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా కోడింగ్‌, రీజనింగ్‌, AI ఏజెంట్లు, సైబర్‌ సెక్యూరిటీ, లైఫ్‌ సైన్సెస్‌ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలపై ఆంత్రోపిక్‌ దృష్టి పెట్టింది.

Details

Fable 5.2లో ఏం ప్రత్యేకం?

కొత్త Claude Fable 5.2 మోడల్‌ కోడింగ్‌, సమస్యలను విశ్లేషించి పరిష్కరించడం, AI ఏజెంట్‌ ఆధారిత పనుల కోసం రూపొందించారు.

డెవలపర్లు, సంస్థలు రోజువారీగా నిర్వహించే క్లిష్టమైన పనుల్లో AI సహాయాన్ని మరింత వేగంగా అందించడమే దీని ఉద్దేశం. మరోవైపు Claude Mythos 5.2ను సైబర్‌ సెక్యూరిటీ, లైఫ్‌ సైన్సెస్‌ పరిశోధన వంటి ప్రత్యేక అవసరాల కోసం తీసుకొచ్చారు.

అయితే ఈ మోడల్‌ను అందరికీ నేరుగా ఇవ్వడం లేదు. కంపెనీ నిర్వహించే వెరిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా అనుమతి పొందిన సంస్థలకే Mythos 5.2 అందుబాటులో ఉంటుంది.

Details

30 శాతం వేగంగా స్పందన

కొత్త మోడల్స్‌లో వేగం కూడా పెరిగిందని ఆంత్రోపిక్‌ చెబుతోంది. గత Claude 5.1 మోడల్స్‌తో పోలిస్తే Fable 5.2, Mythos 5.2 నుంచి వచ్చే అవుట్‌పుట్‌ 30 శాతం వరకు వేగంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

అంతేకాదు.. వినియోగదారులతో మరింత స్పష్టంగా కమ్యూనికేట్‌ చేసేలా మోడల్స్‌ను మెరుగుపరిచినట్లు పేర్కొంది.

అంటే సమాధానం ఇవ్వడమే కాకుండా, వినియోగదారుడి అవసరాన్ని అర్థం చేసుకుని క్లియర్‌గా స్పందించే సామర్థ్యంపై కూడా దృష్టి పెట్టింది.

ADVERTISEMENT

Details

ధరలు కూడా తగ్గాయి

కొత్త మోడల్స్‌ ధర విషయంలోనూ ఆంత్రోపిక్‌ కొంత ఊరట కల్పించింది. 10 లక్షల ఇన్‌పుట్‌ టోకెన్లకు 8 డాలర్లు, అవుట్‌పుట్‌ టోకెన్లకు 40 డాలర్లు చొప్పున ధర నిర్ణయించింది.

గత Fable, Mythos మోడల్స్‌తో పోలిస్తే ఇది తక్కువ ధర. AI సేవలను పెద్ద ఎత్తున ఉపయోగించే డెవలపర్లు, కంపెనీలకు ఈ ధరల తగ్గింపు ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.

ADVERTISEMENT

Details

AI రేసులో పోటీ మరింత వేడి

ఆంత్రోపిక్‌ కొత్త మోడల్స్‌ విడుదల చేయడం వెనుక మార్కెట్‌ పోటీ కూడా ప్రధాన కారణమే. OpenAI, Google, Meta వంటి దిగ్గజాలు వరుసగా కోడింగ్‌, రీజనింగ్‌, AI ఏజెంట్లపై కొత్త మోడల్స్‌ను తీసుకొస్తున్నాయి.

ఇప్పటికే అక్టోబర్‌లో ఆంత్రోపిక్‌ Claude Haiku 5.5ను విడుదల చేసింది. ఇప్పుడు Fable 5.2, Mythos 5.2తో తన ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించింది.

ఐపీఓకు ముందు వరుసగా కొత్త ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా టెక్నాలజీ మార్కెట్‌లో తన బలాన్ని చూపించేందుకు ఆంత్రోపిక్‌ ప్రయత్నిస్తోంది.

ADVERTISEMENT