Claude Opus 4.6: ఆంథ్రోపిక్ కొత్త టూల్.. క్లాడ్ ఓపస్ 4.6 మోడల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ కంపెనీలను కలవరపాటుకు గురిచేసిన అమెరికా ఏఐ స్టార్టప్ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic AI) ఇటీవల మరొక కొత్త టూల్‌ను విడుదల చేసింది. ఈ టూల్ సొంతంగా సీ-కంపైలర్‌లను రూపొందించగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందిస్తూ, ఏఐపై అనవసర భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ''గూగుల్ సెర్చ్, యూట్యూబ్ లా ఏఐ కూడా ఒక సాధారణ సహాయక టూల్ మాత్రమే. మార్కెట్లలో పెరుగుతున్న భయాలు అసహజం. సాంకేతికతను కంపెనీలు తమ అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఇది'' అని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
వివరాలు
ఆవిరైన 285 బిలియన్ డాలర్ల విలువ
అయితే, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత సాఫ్ట్‌వేర్ టూల్స్‌ని ఏఐ మరింత సమర్థవంతంగా మారుస్తుందని, కానీ ఇది మానవ మేధాశక్తిని పూర్తిగా భర్తీ చేయలేదని చెప్పారు. క్లిష్టమైన పనుల్లో ఉద్యోగులు ఏఐను ఉపయోగించి తేలికగా లక్ష్యాలను సాధించగలరని జెన్సెన్ హువాంగ్ తెలిపారు. అంతేగానీ.. వాటిని కృత్రిమమేధ భర్తీ చేయలేదన్నారు. ఇటీవల విడుదలైన ఈ టూల్ కారణంగా సాఫ్ట్‌వేర్, లీగల్ టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల షేర్లు కుదేలిపోయి, కేవలం ఒకే ట్రేడింగ్ సెషన్‌లో ఈ రంగాల్లో 285 బిలియన్ డాలర్ల విలువ ఆవిరయ్యింది.
వివరాలు
ఆంథ్రోపిక్ కొత్త టూల్ ఇదే..
ఈ కొత్త టూల్ 'క్లాడ్ ఓపస్ 4.6' మోడల్ ద్వారా రూపొందించబడింది. మొత్తం 16 క్లాడ్ ఏఐ ఏజెంట్లు కలిసి సీ-కంపైలర్‌పై ప్రయోగాలు జరపగా, సత్ఫలితాలు చక్కగా వచ్చాయని సంస్థ పేర్కొంది. ఆసక్తికరంగా, ఈ ఏజెంట్లు రెండు వారాల్లోనే లక్షల లైన్ల కంపైలర్‌ను సృష్టించగలిగాయి. ఈ కంపైలర్ లైనక్స్ కెర్నల్‌ను కంపైల్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. సీ-కంపైలర్ అంటే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్. ఇది సీ ప్రోగ్రామింగ్ భాషలో రాసిన సోర్స్ కోడ్‌ను మిషిన్ రీడబుల్ ఫార్మాట్ (బైనరీ కోడ్)లోకి మార్చుతుంది. ఈ బైనరీ ఆదేశాలను కంప్యూటర్ CPU అర్థం చేసుకుని నిష్పాదిస్తుంది. సాధారణంగా ఈ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది. ఆ ప్రక్రియను ఏఐ స్వయంగా రూపొందించడం టెక్ నిపుణులను ఆశ్చర్యపరిచింది.