LOADING...
Anthropic: ఆంత్రోపిక్ క్లాడ్ సోర్స్‌ కోడ్‌ లీక్‌..  స్పందించిన కంపెనీ
ఆంత్రోపిక్ క్లాడ్ సోర్స్‌ కోడ్‌ లీక్‌.. స్పందించిన కంపెనీ

Anthropic: ఆంత్రోపిక్ క్లాడ్ సోర్స్‌ కోడ్‌ లీక్‌..  స్పందించిన కంపెనీ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్ ఇటీవల అనూహ్యమైన వివాదంలో చిక్కుకుంది. సంస్థకు చెందిన కీలక సోర్సు కోడ్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆంత్రోపిక్ అభివృద్ధి చేసిన 'Claude Code' అనే ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌కు సంబంధించిన కోడ్ బయటపడటం మరింత ఆసక్తిని రేకెత్తించింది. సమాచారం ప్రకారం, ఈ 'Claude Code' సోర్సు కోడ్‌ను npm registryలో నిల్వ చేయగా, అది అనుకోకుండా పబ్లిక్‌గా అందుబాటులోకి వచ్చింది. ఈ లీక్ ద్వారా క్లాడ్ కోడ్ ఎలా పనిచేస్తుంది? దాని అంతర్గత నిర్మాణం (ఆర్కిటెక్చర్) ఎలా ఉంది? వంటి సున్నితమైన వివరాలు బయటపడ్డాయి.

vivaralu

హ్యాకింగ్ దాడి కాదన్న ఆంథ్రోపిక్

ఈ ఘటనను ఆంథ్రోపిక్ కూడా అధికారికంగా ధృవీకరించింది. ఇది సైబర్ దాడి కాదని, మానవ తప్పిదం వల్ల జరిగిన పొరపాటు అని స్పష్టం చేసింది. భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటామని తరచూ చెప్పుకునే ఆంథ్రోపిక్ సంస్థ నుంచి ఇలాంటి పొరపాటు జరగడం సైబర్ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. తమ సొంత సోర్సు కోడ్‌ను కూడా రక్షించుకోలేకపోవడం పట్ల వారు తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదాలపై ప్రపంచానికి హెచ్చరికలు ఇస్తూ వచ్చిన అదే సంస్థ ఇప్పుడు ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కారణమైంది.

వివరాలు 

భారీ IPO ముందు షాక్

ఇది కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ఆంథ్రోపిక్ సంస్థకు ప్రతిష్టపరంగా గట్టి దెబ్బగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా సుమారు 380 బిలియన్ డాలర్ల విలువతో భారీ IPOకి సిద్ధమవుతున్న ఈ సమయంలో ఈ లీక్ జరగడం పెట్టుబడిదారుల్లో సందేహాలు రేకెత్తించే అంశంగా మారింది. అయితే ఈ ఘటనపై ఆంథ్రోపిక్ స్పష్టతనిచ్చింది. ఇది పూర్తిగా మానవ తప్పిదం వల్ల జరిగినదే తప్ప, ఎలాంటి హ్యాకింగ్ దాడి కాదని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ముఖ్యంగా వినియోగదారుల వ్యక్తిగత డేటా లేదా సంస్థకు చెందిన ప్రధాన AI మోడల్స్ ఎటువంటి ప్రమాదానికి గురికాలేదని స్పష్టం చేసింది.

Advertisement