LOADING...
Anthropic: ఏఐ అభివృద్ధికి బ్రేక్ వేయాలి.. సంచలన పిలుపునిచ్చిన ఆంథ్రోపిక్
ఏఐ అభివృద్ధికి బ్రేక్ వేయాలి.. సంచలన పిలుపునిచ్చిన ఆంథ్రోపిక్

Anthropic: ఏఐ అభివృద్ధికి బ్రేక్ వేయాలి.. సంచలన పిలుపునిచ్చిన ఆంథ్రోపిక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 06, 2026
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

అధునాతన కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థల అభివృద్ధికి తాత్కాలిక విరామం ఇవ్వాలని ప్రముఖ ఏఐ సంస్థ పిలుపునిచ్చింది. ఈ విరామాన్ని అమలు చేయడానికి అనువైన సమన్వయ విధానాన్ని రూపొందించేందుకు ప్రపంచంలోని ప్రధాన ఏఐ కంపెనీలు కలిసి పనిచేయాలని సంస్థ సూచించింది. ఏఐ సాంకేతికత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో దానిపై మానవులు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని ఆంథ్రోపిక్ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన క్లాడ్ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసిన సంస్థ కూడా ఆంథ్రోపిక్‌నే కావడం విశేషం.

వివరాలు

వేగంగా విస్తరిస్తున్న ఏఐ రంగం

సంస్థ అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం ఏఐ రంగం అపూర్వ వేగంతో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి ప్రక్రియను కొంత నెమ్మదింపజేయడం లేదా తాత్కాలికంగా నిలిపివేయడం ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా అవసరమని పేర్కొంది. అలాగే ఏఐ పరిశోధనలకు దశలవారీగా విరామాలు ఇచ్చే విధంగా తమ అంతర్గత పరిశోధనా బృందం ఇతర ఏఐ సంస్థలతో సమన్వయం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుందని వెల్లడించింది. ప్రస్తుత ధోరణులను పరిశీలిస్తే, ఏఐ వ్యవస్థలకు అవసరమైన కంప్యూటింగ్ శక్తి ఇప్పటికే భారీ స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని ఆంథ్రోపిక్ పేర్కొంది.

వివరాలు

వ్యవస్థలపై మనుషుల నియంత్రణ కోల్పోయే ప్రమాదం

అంతేకాకుండా, భవిష్యత్తులో ఏఐ వ్యవస్థలు తమకుతామే మరింత ఆధునిక వారస వ్యవస్థలను రూపొందించుకునే పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సైన్స్‌, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో ఏఐ సాంకేతికత గణనీయమైన ప్రయోజనాలను అందించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, అదే సమయంలో ఈ వ్యవస్థలపై మనుషుల నియంత్రణ తగ్గిపోవడం లేదా పూర్తిగా కోల్పోయే ప్రమాదాన్ని విస్మరించలేమని ఆంథ్రోపిక్ హెచ్చరించింది.

Advertisement