Loading...
Claude AI: భారత్‌లో క్లాడ్ AI ప్లాన్‌ల ధరలు ప్రకటించిన ఆంత్రోపిక్.. ఎంతంటే?
భారత్‌లో క్లాడ్ AI ప్లాన్‌ల ధరలు ప్రకటించిన ఆంత్రోపిక్.. ఎంతంటే?

Claude AI: భారత్‌లో క్లాడ్ AI ప్లాన్‌ల ధరలు ప్రకటించిన ఆంత్రోపిక్.. ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంత్రోపిక్ తన ప్రముఖ AI చాట్‌బాట్ క్లాడ్ (Claude) సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లకు భారత మార్కెట్ కోసం ప్రత్యేక ధరలను ప్రకటించింది. ఇకపై భారతీయ వినియోగదారులు అమెరికన్ డాలర్లకు బదులుగా నేరుగా భారతీయ రూపాయల్లోనే చెల్లింపులు చేయొచ్చు. దీంతో విదేశీ కరెన్సీ మార్పిడి ఛార్జీలు, అదనపు ఫారెక్స్ ఫీజుల భారం ఉండదు. కంపెనీ వెల్లడించిన అన్ని ధరల్లో GST కూడా కలిపి ఉంటుంది. అయితే క్లాడ్ ఉచిత వెర్షన్ యథావిధిగా భారతీయ వినియోగదారులకు అందుబాటులోనే ఉంటుంది.

వివరాలు 

క్లాడ్ ప్రో ప్లాన్ ధర

క్లాడ్ ప్రో (Claude Pro)వార్షిక బిల్లింగ్‌ను ఎంచుకుంటే నెలకు రూ.2,000 చెల్లించాలి. అంటే ఏడాదికి మొత్తం రూ.24,000 అవుతుంది. నెలవారీ బిల్లింగ్‌ను ఎంచుకుంటే రూ.2,399 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్లాన్‌లో డిఫాల్ట్‌గా Sonnet 5 మోడల్‌తో పాటు Opus,Fable 5 వంటి ఇతర AI మోడళ్లను కూడా ఉపయోగించవచ్చు.

ఉచిత ప్లాన్‌తో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ వినియోగ పరిమితి,Research Mode,Unlimited Projects, Memory,Web Search,File Uploads,Voice Mode,Claude Code,Claude Design,Microsoft 365 ఇంటిగ్రేషన్, అలాగే Excel, PowerPoint ఫైళ్లకు మద్దతు లభిస్తుంది.

ఇక ఉచిత ప్లాన్‌లో Sonnet 5,Sonnet 4.6,Haiku 4.5 మోడళ్లతో పాటు వెబ్ సెర్చ్,పరిమిత ప్రాజెక్టులు, ఒక్కో చాట్‌లో గరిష్ఠంగా 20ఫైళ్ల వరకు అప్‌లోడ్ చేసే అవకాశం ఉంటుంది.

వివరాలు 

క్లాడ్ మ్యాక్స్ ప్లాన్‌లు

అధికంగా AI వినియోగించే వారి కోసం ఆంత్రోపిక్ రెండు Claude Max ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Claude Max 5x ధర నెలకు రూ.11,999

Claude Max 20x ధర నెలకు రూ.23,999

ఈ రెండు ప్లాన్‌లలో కూడా క్లాడ్ ప్రోలో ఉన్న అన్ని ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

Claude Code, Cowork, Memory, Projects, Web Search వంటి సౌకర్యాలతో పాటు మరింత ఎక్కువ వినియోగ పరిమితి లభిస్తుంది.

అలాగే రద్దీ సమయాల్లో ప్రాధాన్య యాక్సెస్, ఎక్కువసేపు Claude Code సెషన్‌లు, కొత్త AI మోడళ్లు మరియు ఫీచర్లను ప్రో వినియోగదారుల కంటే ముందుగానే ఉపయోగించే అవకాశం కూడా ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

క్లాడ్ టీమ్ ప్లాన్ ధరలు

వ్యాపార సంస్థలను దృష్టిలో పెట్టుకుని Claude Team ప్లాన్‌లకు కూడా భారతీయ ధరలను ప్రకటించింది.

Claude Team Standard ప్లాన్ వార్షిక బిల్లింగ్‌తో తీసుకుంటే ఒక్కో వినియోగదారుకు నెలకు రూ.2,399 చెల్లించాలి. నెలవారీ బిల్లింగ్ ఎంచుకుంటే రూ.2,999 అవుతుంది.

Claude Team Premium ప్లాన్ వార్షిక బిల్లింగ్‌తో నెలకు ఒక్కో వినియోగదారుకు రూ.11,999, నెలవారీ బిల్లింగ్‌తో రూ.14,999గా నిర్ణయించారు.

ఈ ప్లాన్‌లలో 200K Context Window, Claude Code, Claude Cowork, API Usage Credits, Centralised Billing, Administration Tools, Single Sign-On (SSO),Domain Capture,Admin Controls వంటి ఫీచర్లు ఉంటాయి. అలాగే టీమ్ వినియోగదారుల కంటెంట్‌ను డిఫాల్ట్‌గా తమ AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించబోమని ఆంత్రోపిక్ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

భారత్‌లో క్లాడ్ AI ప్లాన్‌ల ధరలు

Claude Pro - నెలకు రూ.2,000 (వార్షిక బిల్లింగ్) / రూ.2,399 (నెలవారీ)

Claude Max 5x - నెలకు రూ.11,999

Claude Max 20x - నెలకు రూ.23,999

Claude Team Standard - ఒక్కో యూజర్‌కు నెలకు రూ.2,399 (వార్షిక) / రూ.2,999 (నెలవారీ)

Claude Team Premium - ఒక్కో యూజర్‌కు నెలకు రూ.11,999 (వార్షిక) / రూ.14,999 (నెలవారీ)

భారత్‌లో క్లాడ్ AI వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ధరలను ప్రవేశపెట్టినట్లు ఆంత్రోపిక్ తెలిపింది.

రూపాయల్లోనే చెల్లించే అవకాశం రావడంతో అంతర్జాతీయ చెల్లింపులు, అదనపు లావాదేవీ ఛార్జీల గురించి ఆందోళన లేకుండా భారతీయ వినియోగదారులు క్లాడ్ సబ్‌స్క్రిప్షన్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు.

ADVERTISEMENT