Loading...
Anthropic: పేవాల్‌ను దాటి ఎన్నికల డేటాను యాక్సెస్ చేసిన క్లాడ్ ఏఐ.. ఆంత్రోపిక్ కీలక ప్రకటన
ఆంత్రోపిక్ కీలక ప్రకటన

Anthropic: పేవాల్‌ను దాటి ఎన్నికల డేటాను యాక్సెస్ చేసిన క్లాడ్ ఏఐ.. ఆంత్రోపిక్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 26, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రముఖ సంస్థ ఆంత్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ వ్యవస్థ అనుమతి లేకుండానే అమెరికాలోని జార్జియా రాష్ట్ర ఎన్నికల గణాంకాలను పొందేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఫీజు చెల్లించి మాత్రమే చూడగలిగే డ్యాష్‌బోర్డ్‌లోని సమాచారాన్ని క్లాడ్ యాక్సెస్ చేసింది. అయితే, ఇది ఓటర్ల వ్యక్తిగత వివరాలు లేదా రహస్య ఓటింగ్ రికార్డులు కావని ఆంథ్రోపిక్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు ఆధారంగా అందించే మొత్తం ఎన్నికల గణాంకాల సమాచారమేనని తెలిపింది. ఏఐ వ్యవస్థలు తమకు విధించిన పరిమితులను దాటి పనిచేయగలగడం ఈ ఘటనతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

డ్యాష్‌బోర్డ్‌ను యాక్సెస్ చేసేందుకు టోకెన్ కోరిన క్లాడ్

ఆంత్రోపిక్ తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్గత గణాంకాల ప్రాజెక్టులో భాగంగా క్లాడ్‌ను ఉపయోగిస్తున్న సమయంలో, పరిమితులు ఉన్న డ్యాష్‌బోర్డ్‌ను యాక్సెస్ చేసేందుకు అవసరమైన టోకెన్‌ను క్లాడ్ కోరింది.

ఈ ఘటన మళ్లీ జరగకుండా ఉండేందుకు సంస్థ చర్యలు చేపట్టింది.

అయితే, అనుమతి లేకుండా ఏఐ వ్యవస్థలు పరిమిత సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా అడ్డుకోవడానికి ప్రస్తుతం ఉన్న భద్రతా చర్యలు సరిపోతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వివరాలు 

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి జోక్యం లేదు

ఈ ఘటన వల్ల ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగలేదని ఆంథ్రోపిక్ స్పష్టం చేసింది.

క్లాడ్ జార్జియా రాష్ట్ర ఓటరు నమోదు వ్యవస్థను యాక్సెస్ చేయలేదని, వ్యక్తిగత ఓటింగ్ రికార్డులను సేకరించలేదని, ఎన్నికలకు సంబంధించిన డేటాలో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది.

ఫీజు చెల్లించడం ద్వారా పొందగలిగే మొత్తం ఎన్నికల గణాంకాల సమాచారాన్ని మాత్రమే క్లాడ్ యాక్సెస్ చేసిందని పేర్కొంది.

ఓటర్ల వ్యక్తిగత వివరాలు మాత్రం ఇందులో లేవని వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడిన క్లాడ్

క్లాడ్ ఏఐ గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయని ఆంత్రోపిక్ అంగీకరించింది.

ఈ నెల ప్రారంభంలో ప్రచురించిన బ్లాగ్‌ పోస్టులో.. టోకెన్ లేదా చెల్లింపు అవసరమైన వెబ్‌సైట్లలోని సమాచారాన్ని పొందేందుకు క్లాడ్ యాక్సెస్ పరిమితులను దాటిన కొన్ని ఘటనలను వివరించింది.

వీటిలో అమెరికా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ విభాగాలకు చెందిన వెబ్‌సైట్లు కూడా ఉన్నట్లు వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఏఐ భద్రతా ఉల్లంఘనలను ఎప్పుడు వెల్లడించాలి?

ఏఐ వ్యవస్థలు తమకు నిర్దేశించిన పరిమితులను దాటి పనిచేసినప్పుడు, కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు ఆ విషయాన్ని ఎంత త్వరగా బయటపెట్టాలనే చర్చ కూడా ఈ ఘటనతో మొదలైంది.

యాక్సియోస్ (Axios) కథనం ప్రకారం.. ఈ ఘటన బహిరంగంగా వెల్లడించడానికి కొన్ని వారాల ముందే ఆంథ్రోపిక్ సంస్థ జార్జియా రాష్ట్ర కార్యదర్శి కార్యాలయానికి, వైట్‌హౌస్‌కు సమాచారం ఇచ్చింది.

ఈ సమాచారాన్ని ఎప్పుడు, ఎలా వెల్లడించారనే అంశం కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది.

ఏఐ వ్యవస్థల సాంకేతిక పరిమితులు, వాటి భద్రత, బాధ్యతాయుతమైన వినియోగంపై మరిన్ని ప్రశ్నలను ఈ ఘటన లేవనెత్తింది.

ADVERTISEMENT