
ఇకపై యాపిల్ నుండి జనరేటివ్ ఏఐ మోడల్: పెట్టుబడులు పెడుతున్నామని టిమ్ కుక్ సమాధానం
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం ఆపిల్ నుండి ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ రాబోతుందా? ఛాట్ జీపీటీ, గూగుల్ బార్డ్, బింగ్ వరుసలో యాపిల్ కూడా నిలవనుందా? ఎస్.. యాపిల్ నుండి మరికొద్ది రోజుల్లో జనరేటివ్ ఏఐ మోడల్ వచ్చే అవకాశం ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా అర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ లో పెట్టుబడులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. యాపిల్ కూడా జనరేటివ్ ఏఐ మోడల్స్ లో పెట్టుబడులు పెడుతోందని సమాచారం.
యాపిల్ సీఈవో టిమ్ కుక్, రాయిటార్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జనరేటివ్ ఏఐ మోడల్స్ పై తాము విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
Details
జెనరేటివ్ ఏఐ మోడల్స్ డెవలప్ చేసేందుకు యాపిల్ లో భారీగా ఉద్యోగాలు
జనరేటివ్ ఏఐ మోడల్, వాటికి సంబంధించిన ఆర్ అండ్ డీ విభాగాల్లో అనేక పెట్టుబడులు, ఎంతో కాలంగా పెడుతున్నట్లు టిమ్ కుక్ వెల్లడి చేసారు.
ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ఏఐలో అనేక పెట్టుబడులు పెడుతున్నామని టిమ్ కుక్ అన్నారు. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ పై యాపిల్ వర్క్ చేస్తుందనడానికి నిదర్శనంగా యాపిల్ సైట్ కెరీర్ పేజ్ నిలుస్తోంది.
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ లోని పలు విభాగాల్లో ఉద్యోగులను తీసుకునేందుకు 48ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిల్లో మెషిన్ లెర్నింగ్, మల్టీ మోడలింగ్ రీసెర్చ్ ఇంజనీర్ ఇంకా చాలా ఉన్నాయి.