Apple iOS 17.2 Update : ఆపిల్ అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఇందులో ఏమేం ఉన్నాయో తెలుసా
ప్రపంచ దిగ్గజ ఆపిల్ కొత్త iOS 17.1లో తలెత్తిన వైఫై కనెక్టివిటీ సమస్యల పరిష్కరం నిమిత్తం కంపెనీ iOS 17 ఆపరేటింగ్ సిస్టమ్‌ను మరోసారి అప్‌డేట్ చేస్తోంది. కంపెనీ ఇటీవలే iOS 17.1 అప్‌డేట్ ను విడుదల చేసింది. ఫస్ట్ అప్‌డేట్‌లో బగ్ కారణంగా wifi కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. తాజాగా, అంటే వారం తర్వాత ఆపిల్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్ కోసం రెండో అప్‌డేట్ iOS 17.2ని కంపెనీ పరీక్షిస్తోంది. ios 17కి అప్‌గ్రేడ్ అయినప్పట్నుంచి కొందరికి Wi-Fi సమస్యలను ఎదుర్కొన్నారు. రానున్న కొత్త అప్‌డేట్ ఈ బగ్ ను పరిష్కరించనుంది. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు iOS 17 మూలానా Wi-Fi కనెక్టివిటీ సమస్యలున్నాయని నివేదించారు.
ఐఓఎస్ 17.2లో 3 కొత్త వాతావరణ విడ్జెట్‌లు
గత వారమే iOS 17.2 బీటా వెర్షన్ రిలీజ్ అయ్యింది. డిసెంబర్‌లో ఈ కొత్త అప్‌డేట్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. iOS 17.2 కొత్త ఫీచర్లు తెలుసా : జర్నల్ యాప్ iOS 17.2 యూజర్ల కోసం హెల్త్, ఫొటోలు, నోట్స్ వంటి వివిధ యాప్‌ల నుంచి డేటాను ప్రైవేట్‌గా కంపైల్ చేయగలదు. వినియోగదారులు కస్టమ్ ప్రాంప్ట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఎంట్రీలకు ఫొటోలు, వాయిస్ రికార్డింగ్‌లు, లొకేషన్ ట్యాగ్‌లను యాడ్ చేసుకోవచ్చు. ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రైబర్‌లు ఐఓఎస్ 17.2లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్లేలిస్టులపై సహకరించే సామర్థ్యాన్ని పొందవచ్చు. ఐఓఎస్ 17.2లో 3 కొత్త వాతావరణ విడ్జెట్‌లు ఉంటాయి. ఇందులో రోజువారీ సూచన, సూర్యోదయం, సూర్యాస్తమయం, కొత్త డిజిటల్ క్లాక్ విడ్జెట్ ఉంటుంది.