Loading...
Apple: ఆపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఐఫోన్..రేపే లాంచ్!
ఆపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఐఫోన్..రేపే లాంచ్!

Apple: ఆపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఐఫోన్..రేపే లాంచ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ ప్రపంచంలో ఆసక్తి రేపుతున్న ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ త్వరలోనే మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను సెప్టెంబర్ 9న జరగనున్న 'సర్‌ప్రైజ్ అండ్ షైన్' ఈవెంట్‌లో ఆపిల్ ఆవిష్కరించనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తోపాటు ఈ కొత్త మోడల్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి 'ఐఫోన్ అల్ట్రా' లేదా 'ఐఫోన్ ఫోల్డ్' అనే పేర్లలో ఒకదాన్ని ఖరారు చేయవచ్చని మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వివరాలు 

బుక్-స్టైల్ డిజైన్..

లీక్‌ల ప్రకారం.. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ పుస్తకంలా పక్కకు తెరుచుకునే డిజైన్‌తో రూపొందుతోంది.

ఫోన్ మడిచిన స్థితిలో బయట కనిపించే కవర్ డిస్‌ప్లే 5.3 నుంచి 5.5 అంగుళాల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

అదే ఫోన్‌ను పూర్తిగా తెరిస్తే లోపలి ప్రధాన డిస్‌ప్లే 7.6 నుంచి 7.8 అంగుళాల పరిమాణంలో ఉండే అవకాశం ఉంది.

స్క్రీన్‌ను మధ్యలో మడిచినప్పుడు కనిపించే గీత చాలా తక్కువగా ఉండేలా ఆపిల్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

అలాగే ఫోన్ నిర్మాణం చాలా పలచగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఫ్రేమ్ కోసం టైటానియం-అల్యూమినియం మిశ్రమాన్ని ఉపయోగించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

దీంతో తక్కువ మందంతోపాటు ఫోన్‌కు అవసరమైన దృఢత్వం లభిస్తుందని అంచనా.

వివరాలు 

ఏ20 చిప్.. 12 జీబీ ర్యామ్?

హార్డ్‌వేర్ పరంగా ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో ఆపిల్ తదుపరి తరం ఏ20 లేదా ఏ20 ప్రో చిప్‌ను అమర్చవచ్చని సమాచారం.

దాదాపు 12 జీబీ ర్యామ్‌తో ఈ డివైజ్ పనిచేసే అవకాశం ఉన్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి.

పనితీరు, మల్టీటాస్కింగ్ విషయంలో ఇది శక్తిమంతమైన ఫోన్‌గా ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ వైడ్, అల్ట్రావైడ్ కెమెరాలతో కూడిన డ్యూయల్ కెమెరా వ్యవస్థ ఉండొచ్చని తెలుస్తోంది.

ఫోల్డబుల్ ఫోన్‌లో స్థలం పరిమితంగా ఉండటంతో ప్రత్యేక టెలిఫోటో లెన్స్‌ను ఆపిల్ అందించకపోవచ్చని సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

టచ్ ఐడీకి మళ్లీ చోటు?

ఈ ఫోన్‌లో మరో ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది.

ఇప్పటివరకు ఐఫోన్లలో కొనసాగుతున్న ఫేస్ ఐడీకి బదులుగా పవర్ బటన్‌లోనే టచ్ ఐడీని ఏర్పాటు చేయవచ్చని లీక్‌లు చెబుతున్నాయి.

అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ మాత్రం లేదు. బ్యాటరీ విషయానికొస్తే.. 5,000 నుంచి 5,800 ఎంఏహెచ్ మధ్య సామర్థ్యంతో బ్యాటరీని అందించవచ్చని అంచనాలు ఉన్నాయి.

ఫోల్డబుల్ ఫోన్‌లో పెద్ద డిస్‌ప్లే ఉన్న నేపథ్యంలో ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

ధర ఎంతంటే..

ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను అత్యంత ప్రీమియం విభాగంలో తీసుకురానున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

దీని ప్రారంభ ధర 2,000 నుంచి 2,500 అమెరికన్ డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా.

అధికారిక ప్రకటన సెప్టెంబర్ 9న వెలువడితే.. ఐఫోన్ 18 సిరీస్‌తోపాటే ఈ ఫోన్‌కు ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

డెలివరీలు సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్ మధ్య వరకు ఎప్పుడైనా మొదలయ్యే అవకాశముందని తెలుస్తోంది.

వివరాలు 

ధర ఎంతంటే..

ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఉన్న ఇతర తయారీ సంస్థలకు ఆపిల్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

అయితే ఇవన్నీ లీక్‌లు, వివిధ నివేదికల ఆధారంగా వెలువడిన వివరాలే.

ఫోన్ పేరు, డిజైన్, స్పెసిఫికేషన్లు, ధర, లభ్యత వంటి అంశాలపై పూర్తి స్పష్టత సెప్టెంబర్ 9న జరిగే ఆపిల్ అధికారిక ఈవెంట్ తర్వాతే వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT