Apple's foldable iPhone: యాపిల్ స్మార్ట్ ఫోన్,Huawei ని అధిగమిస్తుందా ?
ఆపిల్ స్మార్ట్ ఫోన్ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది.తమ సంస్ధ సొంతంగా మడత పెట్టే ఫోన్ ను తయారు చేయనుంది. ట్రెండ్ ఫోర్స్ అందిస్తున్న సమాచారం ప్రకారం 2027 లోగా తన కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తేకపోవచ్చు. డిజైన్ ఫిలాసఫీ డిజైన్ ఫిలాసఫీ ఎవరికీ తీసి పోని రీతిలో సరికొత్త ఫీచర్లను అందించడంలో యాపిల్ స్మార్ట్ ఫోన్ పేరుంది. దీని తయారీ కోసం ఇప్పటికే శామ్ సంగ్ తో చేతులు కలిపింది.ఫోల్డింగ్ స్క్రీన్ ఫోన్ లను ప్రస్తుతం మార్కెట్ లో లేవు.అయితే వాటిని తీసుకు రావాలని యాపిల్ స్మార్ట్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. దాంతో పాటు తయారు చేసే ఫోల్డింగ్ స్క్రీన్ ఫోన్ సుదీర్ధ కాలం మన్ని,నాణ్యత వుండేలా చూడాలని యాపిల్ నిర్ధేశించుకుంది.
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హువావే శాంసంగ్‌ను అధిగమించింది
TrendForce ఉపయోగించే "విశ్వసనీయత" అనే పదం, మడత యంత్రాంగాన్నికొన సాగించాలని లక్ష్యం చేసుకుంది. ఎక్కువ కాలం పాటు కార్యాచరణను నిర్వహించేలా చూసుకోవడంపై Apple దృష్టి సారిస్తుందని సూచిస్తుంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. Huawei ఇటీవల ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఫోల్డబుల్ పరికరాల్లో సత్తా చూపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన బ్రాండ్‌గా Samsungను అధిగమించింది.అయితే, శామ్సంగ్ తన గెలాక్సీ జెడ్ ఫోల్డ్6 ,జెడ్ ఫ్లిప్6లను వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఆ తర్వాత తన స్థానాన్ని తిరిగి పొందుతుందని భావిస్తున్నారు. పోటీ ల్యాండ్‌స్కేప్‌కు అనుగుణంగా, Huawei కొత్తదనాన్ని చూపాలని తలపోస్తుంది. ఈ ఏడాది జూలై,సెప్టెంబర్ మధ్య ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.