Apple: ఐఫోన్-ఆండ్రాయిడ్ మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్.. ఆపిల్ iOS 26.5 అప్‌డేట్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ తాజాగా iOS 26.5 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు పంపే RCS మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా దశలో ఉండగా.. రాబోయే నెలల్లో దశలవారీగా అందరికీ అందించనున్నట్లు ఆపిల్ తెలిపింది. గతంలో iOS 18.1 ద్వారా RCS సపోర్ట్‌ను తీసుకొచ్చిన ఆపిల్.. టైపింగ్ ఇండికేటర్లు, రీడ్ రిసీట్స్, హైక్వాలిటీ ఫోటో-వీడియో షేరింగ్ వంటి ఫీచర్లను అందించింది.
వివరాలు
RCS ఎన్‌క్రిప్షన్ ఆన్‌లో ఉన్న చాట్‌లలో ప్రత్యేకంగా లాక్ ఐకాన్
ఇప్పుడు iOS 26.5తో మెసేజ్‌ల భద్రతను మరింత పెంచింది. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్‌లోనే ఉంటుంది. అవసరమైతే Settings > Messages > RCS Messagingలోకి వెళ్లి "End-to-End Encryption (Beta)" ఆప్షన్ ద్వారా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇక RCS ఎన్‌క్రిప్షన్ ఆన్‌లో ఉన్న చాట్‌లలో ప్రత్యేకంగా లాక్ ఐకాన్ కూడా కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లకూ ఇదే గుర్తు కనిపించనుంది. అలాగే కొత్త వాల్‌పేపర్లు, ఆపిల్ మ్యాప్స్ మెరుగుదలలు కూడా ఈ అప్‌డేట్‌లో భాగంగా వచ్చాయి.