Loading...
Apple Event 2026: ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో ఆపిల్‌ సర్‌ప్రైజ్‌.. రేపటి ఈవెంట్‌పై భారీ అంచనాలు
ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో ఆపిల్‌ సర్‌ప్రైజ్‌.. రేపటి ఈవెంట్‌పై భారీ అంచనాలు

Apple Event 2026: ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో ఆపిల్‌ సర్‌ప్రైజ్‌.. రేపటి ఈవెంట్‌పై భారీ అంచనాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2026
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్‌ తన కొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే సెప్టెంబర్‌ హార్డ్‌వేర్‌ ఈవెంట్‌ ఈసారి సెప్టెంబర్‌ 9న జరగనుంది. 'సర్‌ప్రైజ్‌ అండ్‌ షైన్‌' పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఆపిల్‌ కుపెర్టినో ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. భారతీయులకు ఈ కార్యక్రమం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్‌లో ఏ ఉత్పత్తులను తీసుకొస్తున్నామనే విషయాన్ని ఆపిల్‌ అధికారికంగా వెల్లడించలేదు. అయితే లీకులు, విశ్లేషకుల అంచనాల ప్రకారం ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు సంస్థ తొలిసారిగా ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.

వివరాలు 

ఫోల్డబుల్‌ ఐఫోన్‌ ఈ ఏడాదే రావొచ్చు:

ఈసారి ఐఫోన్‌ విడుదల విషయంలో ఆపిల్‌ తన సాధారణ విధానాన్ని మార్చే అవకాశం ఉంది.

సాధారణ ఐఫోన్‌ 18 మోడల్‌.. ప్రో సిరీస్‌తో పాటు విడుదల కాకపోవచ్చని సమాచారం.

ఇక ఈ ఈవెంట్‌లో ఆపిల్‌ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను ప్రకటిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

కొన్ని నివేదికల్లో దీనిని 'ఐఫోన్‌ ఫోల్డ్‌' లేదా 'ఐఫోన్‌ అల్ట్రా'గా పేర్కొంటున్నారు.

భారత్‌లో ఉన్నవారు ఆపిల్‌ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌ లేదా సంస్థ ఈవెంట్స్‌ వెబ్‌పేజీ ద్వారా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు.

వివరాలు 

డిస్‌ప్లే పరిమాణంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు

ఐఫోన్‌ 18 ప్రో మోడళ్లలో డిస్‌ప్లే పరిమాణంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా.

ఐఫోన్‌ 18 ప్రోలో 6.3 అంగుళాల స్క్రీన్‌, ప్రో మ్యాక్స్‌లో సుమారు 6.9 అంగుళాల డిస్‌ప్లేనే కొనసాగించే అవకాశం ఉంది.

అయితే డైనమిక్‌ ఐలాండ్‌ ఆక్రమించే స్థలాన్ని తగ్గించడంపై ఆపిల్‌ దృష్టి పెట్టొచ్చని తెలుస్తోంది.

దీని పరిమాణాన్ని కొంత తగ్గించి,ఫోన్‌ మొత్తం పరిమాణాన్ని మార్చకుండానే వినియోగించుకునే స్క్రీన్‌ ప్రాంతాన్ని పెంచే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

A20 ప్రో చిప్‌, కొత్త ఐఓఎస్‌:

ఐఫోన్‌ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడళ్లలో యాపిల్‌ కొత్త A20 ప్రో చిప్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

ఈ చిప్‌ను TSMC సంస్థ 2 నానోమీటర్‌ తయారీ ప్రక్రియతో రూపొందిస్తుందని సమాచారం.

కొత్త ప్రాసెసర్‌ మెరుగైన పనితీరుతో పాటు తక్కువ విద్యుత్‌ వినియోగాన్ని అందించే అవకాశం ఉంది.

ఈ ఫోన్లు తాజా ఐఓఎస్‌ 27తో పనిచేయనున్నాయి. సాఫ్ట్‌వేర్‌ అనుభవంలో ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ కీలక పాత్ర పోషించనుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఆపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్

ఆపిల్‌ తొలిసారిగా తీసుకురానున్న ఫోల్డబుల్‌ ఐఫోన్‌ డిజైన్‌తో ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి.

బయట భాగంలో సుమారు 5.3 నుంచి 5.5 అంగుళాల డిస్‌ప్లే, లోపల 7.7 నుంచి 7.8 అంగుళాల పెద్ద స్క్రీన్‌ ఉండే అవకాశం ఉంది.

లోపలి డిస్‌ప్లే 4:3 నిష్పత్తికి దగ్గరగా ఉండేలా, మరింత చతురస్రాకారంలో కనిపించొచ్చని సమాచారం.

వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం బయట డిస్‌ప్లే, లోపలి ఫోల్డింగ్‌ స్క్రీన్‌ రెండింటిలోనూ కెమెరా ఉండొచ్చని తెలుస్తోంది.

ఐఫోన్‌ 18 ప్రో మోడళ్ల మాదిరిగానే ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌లోనూ A20 ప్రో చిప్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

ADVERTISEMENT