ఉష్ణోగ్రతను, తేమను చెక్ చేసే సరికొత్త ఆపిల్ స్మార్ట్ స్పీకర్
ఆపిల్ రెండవ తరం Homepod స్మార్ట్ స్పీకర్‌ను విడుదల చేసింది. సంగీతాన్ని ప్లే చేయడంతో పాటు, ఇది ఇప్పుడు గది ఉష్ణోగ్రత, తేమను చెక్ చేస్తుంది. రెండు Homepods కనెక్ట్ చేసి స్టీరియో లాగా మార్చచ్చు. స్టీరియోగా మార్చడానికి వినియోగదారులు అదే మోడల్‌లోని Homepodను ఉపయోగించాల్సి ఉంటుంది. HomePod (2వ తరం) ధర రూ. 32,900 ప్రస్తుతానికి బుకింగ్స్ తెరుచుకున్నాయి. ఇది ఫిబ్రవరి 3 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ కొత్త Homepod తెలుపు, నలుపు రంగుల్లో లభిస్తుంది. ఈ కొత్త స్పీకర్ దాని ముందు మోడల్ లాగానే ఉంది, ఇది 6.62 అంగుళాల పొడవు, 5.59 అంగుళాల వెడల్పుతో దాదాపు 2.3 కిలోలు బరువు ఉంటుంది.
స్మార్ట్ స్పీకర్ గది-సెన్సింగ్ టెక్నాలజీతో వస్తుంది
ప్లే చేయడానికి/పాజ్ చేయడానికి ఒకసారి, స్కిప్ చేయడానికి రెండుసార్లు నొక్కాలి. Siriని ఆక్టివ్ చేయడానికి తాకి, పట్టుకోవాలి. HomePod (2వ తరం) S7 చిప్‌తో, 4-అంగుళాల హై-ఎక్స్‌కర్షన్ వూఫర్‌తో వస్తుంది. స్మార్ట్ స్పీకర్ గది-సెన్సింగ్ టెక్నాలజీతో అమర్చి ఉంది, ఇది గోడకు ఎదురుగా ఉందా లేదా ఫ్రీస్టాండింగ్‌లో ఉందో లేదో తెలుసుకోవడానికి దగ్గరలోని శబ్దాలను గుర్తించి దానికి అనుగుణంగా సౌండ్ అవుట్‌పుట్‌ను మారుస్తుంది. ఈ స్పీకర్ ఆరు స్వరాలను గుర్తించగలదు . కొత్త HomePod పొగ, కార్బన్ మోనాక్సైడ్ అలారాలను గుర్తించి కనెక్ట్ చేసిన ఐఫోన్ కి తెలియజేస్తుంది. అన్ని స్మార్ట్ హోమ్ ఉత్పత్తులకు హోమ్ హబ్‌గా పనిచేస్తుంది.