Page Loader
2023 MacBook Pro, Mac miniను  ప్రకటించిన ఆపిల్ సంస్థ
జనవరి 24 నుండి అమ్మకాలు ప్రారంభమవుతాయి

2023 MacBook Pro, Mac miniను ప్రకటించిన ఆపిల్ సంస్థ

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 18, 2023
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ తన 2023 వెర్షన్ MacBook Pro, Mac miniలను పరిచయం చేసింది. MacBook Pro 14-అంగుళాల, 16-అంగుళాల సైజులో అందుబాటులో ఉంది. Mac mini దాని ముందూ మోడల్స్ లాగానే కనిపిస్తుంది. MacBook Pro ప్రారంభ ధర రూ. 2 లక్షలు, Mac mini ధర రూ.59,900. 2023 MacBook Pro దాని ముందు మోడల్స్ లాగానే అల్యూమినియం బాడీ, బ్యాక్‌లిట్ కీబోర్డ్, పెద్ద ట్రాక్‌ప్యాడ్, 1080p ఫేస్‌టైమ్ HD కెమెరా, టచ్ ఐడి ఫింగర్ ప్రింట్ రీడర్ తో వస్తుంది. ఇందులో 96GB RAM, 8TB వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇందులో ఆపరేటింగ్ సిస్టం MacOS వెంచురా, 100Wh బ్యాటరీని 22 గంటల బ్యాటరీ కాలాన్ని అందిస్తుంది.

ఆపిల్

జనవరి 24 నుండి అమ్మకాలు ప్రారంభమవుతాయి

Mac mini సిల్వర్ రంగుతో బాక్సీ డిజైన్‌ వస్తుంది. దీనికి 16GB RAM, 512GB వరకు స్టోరేజ్ ఉంటుంది. ఇందులో ఒక HDMI పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, ఈథర్‌నెట్ పోర్ట్, రెండు USB-A పోర్ట్‌లు, థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు వస్తాయి. భారతదేశంలో 14-అంగుళాల MacBook Pro ప్రారంభ ధర రూ. 2 లక్షలు, 16 అంగుళాల వెర్షన్ ప్రారంభ ధర రూ. 2.5 లక్షలు. M2 చిప్‌తో ఉన్న కొత్త Mac mini ధర రూ. 59,900, M2 Pro ప్రాసెసర్‌ మోడల్ ప్రారంభ ధర రూ. 1.3 లక్షలు. ప్రస్తుతం బుకింగ్స్ తెరుచుకున్నాయి, జనవరి 24 నుండి అమ్మకాలు ప్రారంభమవుతాయి.