ఐఫోన్ 14 Pro డిస్ప్లే సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న ఆపిల్ సంస్థ
ఎట్టకేలకు ఐఫోన్ 14 Pro డిస్ప్లే సమస్యను ఆపిల్ పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తోంది. ఫోన్ ఆన్ చేసినప్పుడు స్క్రీన్‌పై సమాంతర రేఖల సమస్య ఎదుర్కుంటున్న వినియోగదారులకు ఇది శుభవార్తే. ఇది హార్డ్‌వేర్ లోపం కాదని ఈ సమస్యకు సాఫ్ట్‌వేర్ లోపం కారణమని పేర్కొంటూ సమస్యపై పెరుగుతున్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేసింది ఆపిల్. దాని పరిష్కారం త్వరలో విడుదల చేయబోయే iOS అప్‌డేట్ లో ఉంటుందని హామీ ఇచ్చింది. అంతర్గతంగా బగ్‌ను గుర్తించిన తర్వాత ఈ ప్రకటన చేసింది ఆపిల్. గత నెలలో Redditలో, "1LastOutlaw" అనే యూజర్ హ్యాండిల్, ఈ స్క్రీన్ గ్లిచ్‌ల గురించి ఫిర్యాదు చేయగానే , డజను మంది కస్టమర్‌లు ఇదే సమస్యను నివేదించడం ప్రారంభించారు.
ఈ సమస్య పరిష్కరించడానికి ఆపిల్ త్వరలో మరో అప్డేట్ ను విడుదల చేయవచ్చు
కొంతమంది iOS 16.2 అప్డేట్ తర్వాత సమస్య ప్రారంభమైందని పేర్కొన్నారు. రెడ్డిట్ థ్రెడ్ ద్వారా ఒక వినియోగదారు తన ఆందోళనలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నప్పుడు ఆపిల్ అధికారిక పేజీ వినియోగదారు పోస్ట్ కు ప్రతిస్పందించింది.ఈ సమస్యపై సహాయం అందుతుందని హామీ ఇచ్చింది. ఈ సమస్య పరిష్కరించడానికి ఆపిల్ త్వరలో iOS 16.2.1ని విడుదల చేయవచ్చు. అదనంగా, కంపెనీ iOS 16.3 అప్‌డేట్‌పై కూడా పని చేస్తోంది, ఇది ప్రస్తుతం బీటా ప్రోగ్రామ్ పార్టిసిపెంట్‌లు, డెవలపర్‌కు అందుబాటులో ఉంది. ఇలాంటి సమస్యను ఎవరైనా ఎదుర్కొంటున్నట్లయితే ఆపిల్ సపోర్ట్‌ని సంప్రదించండి. OLED ప్యానెల్స్ ఉన్న ఫోన్లకు ఈ సమస్యలు వస్తున్నాయి. ఆ తర్వాత లోపాన్ని పరిష్కరించడానికి మరొక అప్డేట్ ను విడుదల చేయాల్సి వస్తుంది.