Apple's smart glasses: చేతి సంజ్ఞలతో నిచేసే ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్.. కొత్త టెక్నాలజీకి శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం ఆపిల్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Meta Ray-Ban Smart Glassesకు పోటీగా కొత్త AI స్మార్ట్ గ్లాసెస్‌ను తయారు చేస్తోంది. ఈ గ్లాసెస్‌లో రెండు కెమెరాలు ఉండనున్నాయి. ఒకటి హై-రెజల్యూషన్ కెమెరా. అది,ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఉపయోగపడుతుంది. మరోకటి లో-రెజల్యూషన్ వైడ్ యాంగిల్ లెన్స్‌గా ఉండి, చేతి సంజ్ఞలను గుర్తించే పనిని చేస్తుంది. ఇదే కెమెరా Siriకి విజువల్ ఇన్‌పుట్ కూడా అందిస్తుంది. ఇటీవల కాలంలో ఆపిల్ చేతి సంజ్ఞల ఆధారిత టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టింది. ముఖ్యంగా Apple Vision Proలో ఈ ఫీచర్‌ను ఇప్పటికే చూపించింది. అంతేకాకుండా AirPods Proలో కూడా కెమెరాలు, జెష్చర్ సపోర్ట్ వచ్చే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి.
వివరాలు
టెక్నాలజీకి ప్రాధాన్యం
స్క్రీన్ లేకుండా సహజంగా ఉపయోగించుకునే విధానం కావడంతో ఈ టెక్నాలజీకి ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే మొదటి వెర్షన్ స్మార్ట్ గ్లాసెస్‌లో డిస్ప్లే ఉండదని సమాచారం. భవిష్యత్ మోడల్స్‌లో మాత్రం AR ఫీచర్లతో డిస్ప్లే వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ లైఫ్ ఈ గ్లాసెస్‌కు పెద్ద సవాలుగా మారింది. గ్లాసెస్‌ను తేలికగా, స్లిమ్‌గా ఉంచాలనే ఉద్దేశంతో LiDAR, 3D కెమెరాలు, స్క్రీన్ వంటి అధిక పవర్ వినియోగించే ఫీచర్లను తొలగించినట్లు తెలుస్తోంది.
వివరాలు
మెటా రే-బాన్ గ్లాసెస్‌కు గట్టి పోటీ
అలాగే ప్లాస్టిక్ కంటే మెరుగైన, తేలికైన, మొక్కల ఆధారిత అసిటేట్ మెటీరియల్‌తో గ్లాసెస్ డిజైన్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో అడ్వాన్స్‌డ్ వెర్షన్ Siri ఉండనుంది. ఇది త్వరలో రానున్న iOS 27లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. యూజర్లు ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం, కాల్స్ చేయడం మాత్రమే కాకుండా, చుట్టూ ఉన్న పరిసరాలపై సమాచారం కూడా సిరితో తెలుసుకోవచ్చు. మొత్తం ఫీచర్ల పరంగా చూస్తే ఇవి మెటా రే-బాన్ గ్లాసెస్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.