Page Loader
ఆపిల్ లాంచ్ ఈవెంట్: సెప్టెంబర్ 12న జరగబోయే ఈవెంట్లో ఏమేం లాంచ్ కానున్నాయంటే? 
సెప్టెంబర్ 12న జరిగే ఆపిల్ లాంచ్ ఈవెంట్

ఆపిల్ లాంచ్ ఈవెంట్: సెప్టెంబర్ 12న జరగబోయే ఈవెంట్లో ఏమేం లాంచ్ కానున్నాయంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 11, 2023
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ దిగ్గజం ఆపిల్ నుండి మరిన్ని కొత్త ప్రోడక్టులు రాబోతున్నాయి. సెప్టెంబర్ 12వ తేదీన వండర్ లస్ట్(Wonduerlust) పేరుతో జరిగే ఈ ఈవెంటులో ఆపిల్ నుండి ప్రోడక్టులు లాంచ్ కానున్నాయి. స్టీవ్ జాబ్స్ థియేటర్లో జరిగే ఈ లాంచింగ్ వేడుకలో లాంచ్ అయ్యే కొత్త ప్రోడక్టులు ఏంటంటే? ఐఫోన్ 15సిరీస్, వాచ్ సిరీస్ 9 ప్రోడక్టులు లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

Details

ఐఫోన్ 15 సిరీస్ ఫీఛర్లు 

ఐఫోన్ 15సిరీస్ లో నాలుగు మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఐఫోన్ 15, 15ప్లస్, ప్రో, ప్రో మ్యాక్స్ ఉండనున్నాయని సమాచారం. ఐఫోన్ 15, 15ప్లస్ మోడల్స్ కి అల్యూమినియం సైడ్స్ ఉంటే, ప్రో మోడల్స్ ఫోన్లకు టైటానియం సైడ్స్ ఉండనున్నాయి. ఐఫోన్ 15ప్రో మోడల్స్ A17 Bionic SoC తో పాటు 8 GB RAM, 2TB వరకు స్టోరేజీని కలిగి ఉంటాయి. ప్రో మోడల్స్ కానివి A16 Bionic తో పాటు 6GB RAM, 512GB వరకు స్టోరేజీని కలిగి ఉంటాయి. ప్రో మోడల్స్ కాని మోడల్స్ కి 48MP మెయిన్ కెమెరా ఉంటుంది. ప్రో మోడల్స్ కి అదనంగా టెలిఫోటో కెమెరా, 6x ఉంటాయి.

Details

ఆపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2 

ఆపిల్ సంస్థ వాచ్ సిరీస్ 9, అల్ట్రా 2లను లాంచ్ చేయనుంది. వాచ్ సిరీస్ 9 అనేది 41mm, 45mm సైజులను కలిగి ఉంటుంది. అలాగే వాచ్ అల్ట్రా 2 అనేది 49mm సైజులో ఉండే అవకాశం ఉంది. ఈ వాచెస్ లలో హార్ట్ రేట్ సెన్సార్ ప్రధానంగా ఉండనుంది. అంతేకాదు, ఈ లాంచ్ ఈవెంట్ ఎయిర్ బడ్స్ కూడా లాంచ్ కానున్నాయి. టైప్ సి పోర్టుతో ఛార్జింగ్ సౌకర్యం గల ఎయిర్ బడ్స్, కాల్స్ ని మ్యూట్ చేయడం, అన్ మ్యూట్ చేయడం వంటి ఫీఛర్లతో ఉంటాయి.