Page Loader
యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ లాంచ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
యాపిల్​ లాంచ్​ చేసిన విజన్​ ప్రో

యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ లాంచ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 06, 2023
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

యాపిల్ లాంచ్ చేసిన విజన్ ప్రో పై టెక్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 తొలి రోజులో భాగంగా యాపిల్ లాంచ్ చేసిన విజన్ ప్రో హైలెట్ గా నిలవడం విశేషం. ఇందులో హై రిజల్యూషన్ డిస్ ప్లేలతో కళ్లతో, వాయిస్ తో ఈ డివైజ్ ని కంట్రోల్ చేయవచ్చు. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ రెండిటినీ ఇది సపోర్టు చేయనుంది. ఈ హెడ్‌సెట్‌లో కెమెరాలు కూడా ఉండడం గమనార్హం. కర్వడ్ ఫ్రేమ్, ఫ్రెంట్ గ్లాస్, థర్మల్ వెంట్స్, ఎడమవైపు ఫుష్ బటన్స్ వంటివి ఉన్నాయి. ఇందులో డ్యూయెల్ 1.41 ఇంచ్ 4కే మైక్రో ఓఎల్ఈడీలు, 12 కెమెరాలు ఉంటాయి. మెయిల్, మ్యూజిక్, మెసేజ్, సఫారీ వంటివి ట్రాక్ చేయవచ్చు.

Details

వచ్చే ఏడాది విక్రయానికి వచ్చే అవకాశం

ఈ డివైజ్‌లో ఆప్టిక్ ఐడీ అనే కొత్త సిస్టమ్ రానుంది. దీన్ని కీబోర్డులో కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఐరిస్ తో దీన్ని వాడుకోవచ్చు. యాపిల్ పవర్ ఫుల్ ఎం2 చిప్, ఆర్ 1 చిప్ ల ద్వారా ఈ హెడ్ సెట్ పని చేయనుంది. కంటికి సైట్ ఉన్న యూజర్లు కూడా దీన్ని ఉపయోగించేందుకు జీస్ ఆప్టికల్ ఇన్‌సెర్ట్స్ ను అందించారు. యాపల్ విజన్ ప్రో ధర అమెరికాలో రూ. 3499 డాలర్లు (మనదేశ కరెన్సీలో రూ.2,88,700) గా నిర్ణయించారు. యాపిల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది విక్రయానికి వచ్చే అవకాశం ఉంది. యాపిల్ స్టోర్లలో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు.