తెలియని ఫోన్ నంబర్ నుండి వాట్సప్ లో కాల్స్ వస్తున్నాయా.. మీకో హెచ్చరిక!
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలతో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నోరకాల మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈసారి సైబర్ నేరగాళ్ల వాట్సప్ ను తమ మోసానికి వారధిగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల కాలంలో చాలామంది వాట్సప్ యూజర్లకు తెలియని నెంబర్ నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ ఫేక్ కాల్స్ ద్వారా కొంతమంది అమాయకులను సైబర్ నేరగాళ్లు బుట్టలో వేసుకుంటున్నారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్ ను కొనుగోలుతో ఇతర దేశాల నుంచి ఫోన్ వస్తున్నట్లు భ్రమలు కలిగిస్తున్నారు. దీంతో వర్క్ ఫ్రం హోం అని అశ చూపుతూ అకౌంట్లలో డబ్బులను దండుకుంటున్నారు. కావున ఇలాంటి ఫోన్స్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు
అన్ నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ లిప్ట్ చేయకపోవడం ఉత్తమం
ఇప్పటికే చాలామంది యూజర్లు తమకు గుర్తు తెలియని నెంబర్స్ నుంచి ఫోన్స్ కాల్స్ వస్తున్నాయంటూ ట్విట్టర్ వేదికగా స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉంటే ఎట్టి పరిస్థితిలోనూ తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ ను లిఫ్ట్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా మోసం చేస్తే వెంటనే దగ్గర్లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచింది. అదే విధంగా లైక్స్ చేస్తే డబ్బులు ఇస్తారంటూ జరుగుతోన్న ప్రచారం ఎటువంటి నిజం లేదని గ్రహించాలి. ఇప్పటికే చాలామంది సైబర్ నేరగాళ్ల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే.