Page Loader
వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సప్
ఓకే ఫోన్లలో నాలుగు వాట్సప్ లు

వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2023
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిగ్గజ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ సంస్థ యూజర్లకు తీపికబురును అందించింది. ఇకపై యూజర్లు ఒకటి కన్నా ఎక్కువ ఫోన్లలో వాట్సప్ లాగిన్ ఛాన్స్ లభించింది. యూజర్లు అందరికీ ఈకొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఒకటి కన్నా ఎక్కువ ఫోన్స్ వాడే వారికి ఈఫీచర్ ఉపయోకరంగా ఉండనుంది. ఇప్పటివరకు కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌ల్లో వెబ్ వెర్షన్ కు ఇలా లాగిన్ అయ్యే సదుపాయం ఉంది. తాజాగా వేరే ఫోన్లలో కూడా వాట్సప్ ఆకౌంట్ను ఉపయోగించుకోవచ్చు. వాట్సప్ అకౌంట్ ను వేరే ఫోన్ కు లింక్ చేసుకునేందుకు వాట్సప్ లో వెబ్ లాంటి ప్రాసెస్ తో పాటు వేరే మొబైల్లో లాగిన్ అయ్యేందుకు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది.

Details

ఓటిపితో లాగిన్ అయ్యే ఛాన్స్

వేరే మొబైల్ లో లాగిన్ అయ్యేందుకు ఓటీపీ కూడా అవసరమని వాట్సప్ సంస్థ చెబుతోంది. అయితే ప్రతిసారి ప్రైమరీ అకౌంట్ నుంచే వేరే మొబైళ్లకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా సెకండరీ ఫోన్లలో వాట్సప్ ఓపెన్ చేసి, ఆ తర్వాత ప్రైమరీ ఫోన్లలో వాట్సప్ సెట్టింగ్ లో లింక్డ్ డివైజెస్ సెక్షన్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత అక్కడ లింక్ ఎ డివిజ్ ని టచ్ చేసి, స్క్రీన్‍పై వచ్చే ఇన్‍స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. వెంటనే ప్రైమరీ ఫోన్లో కెమెరా ఓపెన్ అవుతుంది. తర్వాత సెకండరీ ఫోన్లో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే వేరే మొబైల్లో వాట్సప్ ఉపయోగించుకొనే అవకాశం ఉంటుంది.