LOADING...
Artemis-2: ఆర్టెమిస్‌-2 యాత్రలో చంద్రుని చుట్టూ తిరిగిన వ్యోమగాములు.. భూమి వైపు ప్రయాణం ప్రారంభం
భూమి వైపు ప్రయాణం ప్రారంభం

Artemis-2: ఆర్టెమిస్‌-2 యాత్రలో చంద్రుని చుట్టూ తిరిగిన వ్యోమగాములు.. భూమి వైపు ప్రయాణం ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2026
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టెమిస్‌-2 యాత్రలో భాగంగా చంద్రుని చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసిన వ్యోమగాములు తిరిగి భూమి దిశగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రుని అవతలి వైపు నుంచి తీసిన భూమి చిత్రాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా విడుదల చేసింది. తిరుగు ప్రయాణంలో ఈ యాత్ర కమాండర్ రీడ్ వైస్‌మాన్ ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు సమాచారం. ఈ అరుదైన దృశ్యాన్ని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ కూడా సామాజిక మాధ్యమాలలో పంచుకుంది.

వివరాలు 

యాత్రలో ముగ్గురు అమెరికా దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడు

చంద్రుని అవతలి వైపు నుంచి తీసిన తొలి భూమి చిత్రం ఇదేనని పేర్కొంది. ఈ యాత్రలో ముగ్గురు అమెరికా దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడు పాల్గొన్నారు. వీరు చంద్రునిపై అడుగుపెట్టకుండా, దూరం నుంచే చంద్రుడిని చుట్టి తిరుగుతున్నారు. ఈ యాత్రకు వినియోగిస్తున్న రాకెట్,వ్యోమనౌకలోని ముఖ్యమైన వ్యవస్థల పనితీరును పరీక్షించడం ప్రధాన లక్ష్యంగా ఈ మిషన్ కొనసాగుతోంది.

Advertisement