Loading...
Baghdad Battery: రెండు వేల ఏళ్ల క్రితమే బ్యాటరీ ఉందా? శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న 'బాగ్దాద్‌ బ్యాటరీ' రహస్యం
రెండు వేల ఏళ్ల క్రితమే బ్యాటరీ ఉందా? శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న 'బాగ్దాద్‌ బ్యాటరీ' రహస్యం

Baghdad Battery: రెండు వేల ఏళ్ల క్రితమే బ్యాటరీ ఉందా? శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న 'బాగ్దాద్‌ బ్యాటరీ' రహస్యం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 16, 2026
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

విద్యుత్‌ను ఆధునిక శాస్త్రం ప్రపంచానికి అందించిందని అందరికీ తెలిసిందే. అయితే దాదాపు రెండు వేల ఏళ్ల క్రితమే మనుషులకు విద్యుత్‌పై కొంత అవగాహన ఉండి ఉండొచ్చా? అనే ప్రశ్నకు కారణమైన ఓ పురాతన వస్తువు ఇప్పటికీ శాస్త్రవేత్తల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదే 'బాగ్దాద్‌ బ్యాటరీ'. చిన్న మట్టి పాత్రలా కనిపించే ఈ వస్తువు అసలు దేనికోసం ఉపయోగించారనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోయినా, ప్రాచీన నాగరికతల సాంకేతిక పరిజ్ఞానంపై కొత్త చర్చలకు దారి తీస్తోంది.

వివరాలు

చిన్న మట్టి పాత్ర.. పెద్ద రహస్యం..

'బాగ్దాద్‌ బ్యాటరీ'గా పిలిచే ఈ పురాతన వస్తువు మట్టితో తయారు చేసిన చిన్న పాత్ర.

ఇది 1936లో ఇరాన్‌ రాజధాని బాగ్దాద్‌కు సమీపంలోని ఖుజుత్‌ రాబు ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.

జర్మనీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త విల్హెమ్‌ కోనిగ్‌ దీనిని గుర్తించి, 1938లో ప్రపంచానికి పరిచయం చేశారు.

ఈ పాత్రలో రాగితో చేసిన గొట్టం, ఇనుప కడ్డీ అమర్చబడి ఉన్నాయి. ఇందులో వెనిగర్‌ లేదా ద్రాక్షరసం వంటి ఆమ్ల గుణాలు ఉన్న ద్రవాన్ని పోస్తే స్వల్ప స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు.

అందుకే దీనిని ప్రపంచంలోనే తొలి బ్యాటరీగా కొందరు పేర్కొంటున్నారు.

వివరాలు

అసలు ఉపయోగం ఏంటి?

అయితే ఈ వస్తువును నిజంగానే విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఉపయోగించారా లేదా అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.

కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం బంగారం, వెండి వంటి లోహాలపై పలుచటి పూత వేయడానికి దీనిని ఉపయోగించి ఉండొచ్చని చెబుతున్నారు.

మరోవైపు, ఇది సాధారణ నిల్వ పాత్రగా లేదా మతపరమైన ఆచారాల్లో వినియోగించే వస్తువుగా ఉండి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ వాదనల్లో ఏదీ ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలతో నిర్ధారించబడలేదు.

ADVERTISEMENT

వివరాలు

వోల్టా కంటే చాలా ముందేనా?

ఆధునిక బ్యాటరీని ఇటలీ శాస్త్రవేత్త అలెసాండ్రో వోల్టా 1800లో అభివృద్ధి చేశారు. కానీ 'బాగ్దాద్‌ బ్యాటరీ'గా గుర్తించిన ఈ వస్తువు దాదాపు రెండు వేల ఏళ్ల నాటిదిగా భావిస్తున్నారు.

దీంతో ప్రాచీన నాగరికతలకు విద్యుత్‌పై కొంత మేర అవగాహన ఉండి ఉండొచ్చనే చర్చ తరచూ వినిపిస్తోంది.

అయినప్పటికీ, దీనిని ప్రపంచంలో తొలి విద్యుత్‌ బ్యాటరీగా నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికీ లేవని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

ADVERTISEMENT