Page Loader
Big battery phones: బిగ్‌ బ్యాటరీ బూస్ట్‌.. స్మార్ట్‌ఫోన్‌లకు నూతన శక్తి!
బిగ్‌ బ్యాటరీ బూస్ట్‌.. స్మార్ట్‌ఫోన్‌లకు నూతన శక్తి!

Big battery phones: బిగ్‌ బ్యాటరీ బూస్ట్‌.. స్మార్ట్‌ఫోన్‌లకు నూతన శక్తి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 14, 2025
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్మార్ట్‌ ఫోన్‌ వాడే ప్రతి యూజర్‌కి సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో ముఖ్యమైందిగా ఛార్జింగ్‌ నిలుస్తుంది. ఏ ఫోన్‌ అయినా చూసినా, ఒక రోజు వాడిన తర్వాత సాయంత్రానికి తిరిగి ఛార్జింగ్‌ పెట్టాల్సిందే! వినియోగం తక్కువైనా.. మరుసటి పూటకు మించిన బ్యాటరీ లైఫ్‌ ఆశించలేం. ఇక పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్‌ తీసుకోవాలంటే బరువు సమస్య ఎదురవుతుంది. పైగా అవి చేతిలో ఇమడటం కష్టమే. అయితే ఇకపై అటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలపై దృష్టి సారిస్తున్నాయి. మున్ముందు స్లిమ్ డిజైన్‌తో కూడిన 7000mAh కంటే ఎక్కువ సామర్థ్యమున్న బ్యాటరీలతో ఫోన్లు మార్కెట్‌లోకి రానున్నాయి.

Details

రెండు రోజుల పాటు ఛార్జింగ్

ఒకప్పుడు 2000mAh బ్యాటరీ ఫోన్‌ అంటే ఓ ప్రత్యేకత. ఆ తర్వాత 3000, 4000, 5000mAh అంటూ అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇప్పుడు సగటు స్మార్ట్‌ఫోన్‌ 5000mAh నుంచి 6000mAh వరకు బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇక ఛార్జింగ్‌ వేగం విషయానికొస్తే.. 100W, 120W ఫాస్ట్‌ ఛార్జర్లూ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఐకూ సంస్థ 7300mAh భారీ బ్యాటరీతో ఫోన్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల ఇతర బ్రాండ్లు కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నాయి. ఇలా చూస్తే ఫోన్‌ ఛార్జింగ్‌ సమస్య త్వరలో మిగిలిపోదన్న మాట. ఒకసారి ఛార్జ్‌ చేస్తే రెండు రోజులపాటు ఫోన్‌ నడిపే అవకాశం వుంది.

Details

 ఇప్పుడు మార్కెట్‌లోకి రానున్న భారీ బ్యాటరీ ఫోన్లు

ఐకూ జడ్‌10 (iQOO Z10) ఐకూ సంస్థ ఇటీవల లాంచ్‌ చేసిన జడ్‌10 ఫోన్‌లో 7,300mAh సామర్థ్యం గల బ్యాటరీ ఇచ్చారు. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్‌ 52 గంటల టాక్‌టైమ్‌, 15 గంటల గేమింగ్‌ బ్యాకప్‌ ఇస్తుంది. 90W ఫాస్ట్‌ ఛార్జర్‌ను బాక్సులోనే అందిస్తోంది.అంత పెద్ద బ్యాటరీ ఉన్నా.. ఫోన్‌ బరువు కేవలం 199 గ్రాములే. మందం కూడా 7.89 మిల్లీమీటర్లు మాత్రమే. ఇది ఏప్రిల్‌ 11న విడుదలైంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ5 (OnePlus Nord CE5) వన్‌ప్లస్‌ సంస్థ తన నార్డ్‌ సీఈ4 (5500mAh బ్యాటరీ)కి కొనసాగింపుగా, నార్డ్‌ సీఈ5ను తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఈఫోన్‌ 7100mAh సామర్థ్యంతో రానుంది. భారత్‌లో ఇది వచ్చే నెలలో లాంచ్‌ అయ్యే అవకాశముంది.

Details

ఒప్పో K13 (Oppo K13) 

ఒప్పో సంస్థ కె12కి సక్సెసర్‌గా కె13ను ఏప్రిల్‌ 21న విడుదల చేయనుంది. ఇది 7,000mAh బ్యాటరీతో రానుంది. మందం 8.455 మిల్లీమీటర్లు కాగా.. బరువు సుమారు 208 గ్రాములు. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంటుంది. ధర తదితర వివరాలు లాంచ్‌ సమయంలో వెల్లడించనున్నారు. రియల్‌మీ జీటీ 7 (Realme GT 7) రియల్‌మీ సంస్థ తన జీటీ6 తర్వాత, జీటీ7ను ఏప్రిల్‌ 23న చైనాలో లాంచ్‌ చేయనుంది. ఈ ఫోన్‌లో 7200mAh భారీ బ్యాటరీ ఇవ్వబోతున్నారు. భారత్‌లో కూడా దీన్ని కొన్నివారాల్లో అందుబాటులోకి తేనున్నారు. భవిష్యత్తులో మరిన్ని అధిక సామర్థ్యం గల బ్యాటరీలతో ఫోన్లు మార్కెట్‌లోకి రానున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఛార్జింగ్‌ సమస్య తగ్గి, ఎక్కువ సమయం ఫోన్‌ వాడుకునే వీలుంటుంది.